Ashureddy: పెళ్లి కాకుండానే తల్లైన అషురెడ్డి.. ఏమైందంటే?

Ashureddy: ఇప్పుడు వినోదభరిత ప్లాట్ ఫామ్ ఏదైనా ఉందంటే అది సోషల్ మీడియానే అని చెప్పాలి. చాలా మంది దీని పుణ్యమా అని రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోతున్నారు. సోషల్ మీడియాలో తమ ప్రతిభను చూపిన వారికి సినిమాల్లో, అనేక టీవీ షోల్లో అవకాశాలు దక్కుతున్నాయి. అలాంటి వారిలో ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తోన్న పేరు అషురెడ్డి. ఈమె గతంలో హీరోయిన్ సమంత లాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో ఈమెను జూనియర్ సమంత అనేవారు. టిక్ టాక్ ద్వారా వీడియోలు చేస్తూ అషురెడ్డి ఫేమస్ అయ్యింది. అందుకే ఆమెకు బిగ్ బాస్ లో కూడా చోటు దక్కింది.

 

అషురెడ్డి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చాక అక్కడ మాత్రం తన సత్తా ఏంటో నిరూపించుకోలేకపోయింది. ఆ తర్వాత కామెడీ స్టార్స్ తో జత కట్టింది. ఎక్స్ ప్రెస్ హరితో కలిసి కామెడీ స్కిట్లల్లో లవ్ ట్రాక్ నడిపింది. అందరూ వీరి జంటను నిజంగానే లవర్స్ అనుకున్నారు. టాటూలు వేయించుకోవడం, ముద్దులు పెట్టుకోవడం, ఏడ్వటం ఇవన్నీ బిల్డప్ గా చేశారు. వీరి హంగామాకు అందరూ షాక్ అయ్యారు.

తాజాగా అషురెడ్డి షోలో కంటే కూడా తన అందం మీదనే ఎక్కువగా దృష్టి పెడుతుందనే చాలా మంది అనుకుంటున్నారు. ఇప్పుడు మరోసారి ఆమె మీద ట్రోల్స్ ఎక్కువయ్యాయి. తాజాగా జరిగిన ఓ స్కిట్‌ లో ఎక్స్‌ ప్రెస్‌ హరితో ఈ చిన్నది ఓ కామెడీ స్కిట్ చేసింది. ఇందులో ఎక్స్‌ ప్రెస్ హరి మాట్లాడుతూ అషూ తాను ప్రేమించుకుంటున్నామని తెలిపాడు.

 

అషుతో తనకు ఏడాది కంటే ముందే పెళ్లి జరిగిందని, ఇద్దరం కూడా లేచిపోయి పెళ్లి చేసుకున్నట్లు తెలిపాడు. తమకు పిల్లలు కూడా పుట్టారని, ఆఖరిలో అషురెడ్డి చేతిలో ఒక బేబీని కూడా పెట్టాడు. ఇదంతా స్కిట్ భాగంగానే చేసినా నెటిజన్లు మాత్రం వీరిని ఓ ఆట ఆడుకుంటున్నారు. అషురెడ్డికి పిల్లలు ఉన్నారా అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -