Aswani Dutt: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి వారిలో ప్రముఖ నిర్మాత అశ్వినీ దత్ ఒకరు. శ్రీ వైజయంతి మూవీస్ బ్యానర్ ద్వారా ఎన్నో అద్భుతమైన సినిమాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసినటువంటి ఈయన తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.ఈ ఇంటర్వ్యూ సందర్భంగా అశ్విని మాట్లాడుతూ పలువురు హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్నటువంటి నందమూరి బాలకృష్ణ మెగాస్టార్ చిరంజీవి గురించి ఈయన చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఈ ఇంటర్వ్యూలో అశ్విని నందమూరి తారక రామారావు గురించి మాట్లాడుతూ నటనలో ఆయన ఒక శిఖరం అని పేర్కొన్నారు. తారక రామారావు గారు ఎక్కువగా దేవుడి పాత్రలలో నటించడం వల్ల ఆయనని అందరూ కూడా దైవ సమానంగానే భావించేవారు.
ఇలా నటనలో ఎన్టీఆర్ ఒక శిఖరం అయితే చిరంజీవి మరో శికరమని తెలిపారు. ఎన్టీఆర్ ఎలా క్రమశిక్షణతో ఉండేవారు చిరంజీవి కూడా అంతే క్రమశిక్షణతో ఉంటూ సినిమాలలో నటిస్తూ ఎంతో కష్టపడ్డారని తెలిపారు.ఇక సినిమాలు చేయటంలో చిరంజీవి ఎంత కష్టపడేవారు బాలకృష్ణ అంతకుమించి కష్టపడే వారిని ఈ సందర్భంగా అశ్వినీ దత్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అలాగే నాగార్జున వెంకటేశ్ వంటి వారందరూ కూడా చాలా క్రమశిక్షణగా మెలిగే వారిని తెలియజేశారు.
ఈ విధంగా ఇండస్ట్రీలోని స్టార్ హీరోల గురించి నిర్మాత అశ్వినీ దత్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈయన ప్రస్తుతం తన నిర్మాణంలో ప్రభాస్ హీరోగా అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రాజెక్టుకే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకుడుగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ సరసన నటి దీపిక పదుకొనే నటిస్తున్నారు.