Rashmi: ఇయర్ ఎండ్ పార్టీలో రష్మీ ..మందు బాటిల్ తో రచ్చ రచ్చ

Rashmi: న్యూ ఇయర్ వస్తోందంటే చాలు ఆ హడావుడి అంతా మాటల్లో చెప్పలేం. నూతన సంవత్సరానికి ఆహ్వానం పలకడాని అందరూ ఇప్పటి నుంచే ప్లాన్స్ వేసుకుంటున్నారు. కొంత మంది సెలబ్రిటీలు సైతం సెలబ్రేషన్స్, పార్టీలు గురించి సోషల్ మీడియాలో పోస్టింగులు పెడుతున్నారు. తాజాగా యాంకర్ రష్మీ కూడా ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్స్ చేసుకుంటున్న విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. జబర్దస్త్ షో ద్వారా యాంకర్ రష్మీ బాగా క్రేజ్ సంపాదించుకుంది.

 

అటు జబర్దస్త్ షోలో యాంకరింగ్ చేస్తూ ఇటు సినిమాల్లో కూడా నటిస్తూ వస్తోంది. రష్మీ మొదట్లో పలు సినిమాల్లో సైడ్ క్యారెక్టర్లలో కనిపించింది. ఆ తర్వాత జబర్దస్త్ లో యాంకర్ గా తన కెరీర్ ను ప్రారంభించి పాపులారిటీని పొందింది. కొన్ని సినిమాల్లో ఆమె హీరోయిన్ గా కూడా నటించింది. ప్రస్తుతం రష్మీ చేతిలో జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ, తదితర ఈవెంట్లు ఉన్నాయి. అలాగే మరో స్టార్ యాంకర్ అయిన దీపిక పిల్లి కూడా ఇప్పుడు మంచి ఫామ్ లో ఉంది.

 

చాలా ఈవెంట్లలో రష్మీ, దీపిక పిల్లి ఇద్దరూ రచ్చ చేస్తూ కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలో కూడీ ఈ యాంకర్లిద్దరూ చాలా యాక్టీవ్ గా ఉంటారు. తాజాగా రష్మీ ఒక స్టోరీని తన ఇన్ స్టాగ్రామ్ ఖాతా ద్వారా పంచుకుంది. అందులో తనతో పాటు దీపిక పిల్లి కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

 

వీరితో పాటు మరో అమ్మాయి కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు కలిసి అలా మందుతో చిల్ అవుతున్నట్లుగా ఒక ఫోటోని రష్మీ షేర్ చేయడంతో అదికాస్తా వైరల్ అవుతోంది. పైగా ఇందులో 2022లో ఇదే లాస్ట్ అన్నట్లుగా క్యాప్షన్ కూడా ఉండటంతో ఈ పోస్టుకు నెటిజన్లు షాక్ అవుతున్నారు. మందు పార్టీలో రష్మీ బిజీగా ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -