Atlee: తండ్రి కాబోతున్న ఆ స్టార్ డైరెక్టర్? శుభాకాంక్షలు చెబుతోన్న సెలబ్రిటీలు

Atlee: సినీ ఇండస్ట్రీలో హీరోలతో పాటు డైరెక్టర్లకూ మంచి పేరుంది. అందులోనూ తమిళ డైరెక్టర్లకు మరింత క్రేజ్ అనేది ఉంటుంది. అటువంటివారిలో అట్లీ కూడా ఒకరు. తమిళ దర్శకుడు అయిన అట్లీ కుమార్‌ విభిన్న కథాంశాలతో సినిమాలు చేసి పేరుపొందారు. ఈ కుర్ర డైరెక్టర్ కి ఇప్పుడు తండ్రిగా ప్రమోషన్ వచ్చింది. ఈయన తండ్రి కాబోతున్నాడు.

 

సోషల్‌ మీడియా ద్వారా అట్లీ ఈ విషయాన్ని అభిమానులతో పంచుకున్నాడు. కాగా అట్లీ కుమార్, నటి కృష్ణ ప్రియను 2014లో పెళ్లి చేసుకున్నారు. వీరికి వివాహం అయిన ఎనిమిది ఏళ్ల తర్వాత వీరిద్దరూ తల్లిదండ్రులు కాబోతుండటం ఆనందకర విషయం. తాజాగా వీరిద్దరూ ఇన్‌స్టాగ్రామ్‌లో బేబి బంప్‌తో ఉన్న ఫోటోలను షేర్ చేసి ఫ్యాన్స్ కు సర్పైజ్ ఇచ్చారు.

 

ఇటువంటి సంతోషకర విషయాన్ని అనౌన్స్‌ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉందని, అందరి ప్రేమ, ఆశీర్వాదాలు తమకు కావాలని ఈ జంట పోస్టు చేసింది. దీనిపై పలువురు సెలబ్రిటీలు రియాక్ట్ అయ్యారు. తల్లిదండ్రులు కాబోతున్న ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అట్లీ మొదటగా ఏఆర్ మురుగదాస్ దగ్గర అసిస్టెంట్ గా పనిచేశారు. ఆ తర్వాత మురుగదాస్ నిర్మాణ సంస్థలోనే రాజారాణి అనే సినిమాను చేశారు.

 

రాజారాణి సినిమా మంచి విజయం సాధించడంతో ఆ తర్వాత విజయ్ తో కలిసి తేరి అనే సినిమా చేశారు. అది కూడా సూపర్ హిట్ గా నిలిచింది. దీంతో స్టార్ డైరెక్టర్ గా అట్లీ పేరుపొందారు. ఆ తర్వాత వరుసగా విజయ్ తో మెర్సల్, బిగిల్ లాంటి సినిమాలు తీశాడు. ప్రస్తుతం బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ తో జవాన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ వచ్చే ఏడాది జూన్‌ 2న విడుదల అవ్వనుంది. అట్లీ భార్య ప్రియా కూడా పలు తమిళ సినిమాల్లో కనిపించింది. ‘నా పేరు శివ’, ‘యముడు’ వంటి సినిమాల్లో ఆమె నటించింది.

Related Articles

ట్రేండింగ్

Roja: నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిలా మారిన రోజా.. శత్రువులే తప్ప మిత్రులు లేరా?

Roja:  నగరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి రోజా ప్రస్తుతం నగరి నియోజకవర్గంలో ఒంటరి పక్షిగా మారిపోయారు. ఈమె 2014 ఎన్నికలలో వైసిపి నుంచి గెలుపొందారు. అలాగే 2019 సంవత్సరంలో కూడా 2...
- Advertisement -
- Advertisement -