Mumbai: దారుణం.. తల్లి శవంతో రెండు నెలలుగా ఉంటున్న మహిళ?

Mumbai: మహరాష్ట్ర రాజధాని ముంబై లోని లాల్‌బాగ్ ప్రాంతంలోని ఇబ్రహీం కసమ్‌ భవనంలోని ఫస్ట్ ఫ్లోర్‌లోని ఒక ఫ్లాట్‌లో తల్లి కూతురు నివాసం ఉంటున్నారు. అయితే రెండు నెలలుగా వీణా జైన్ కనిపించడం లేదని ఆమె బంధువు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు అపార్ట్‌మెంట్‌ లోని కూతురు ఫ్లాట్‌కు వచ్చి తలుపు కొట్టారు. లోపల శవాన్ని ప్లాస్టిక్ కవర్‌ లో చుట్టి ఉంచినట్లుగా పోలీసులు గుర్తించారు. తల, మొండెం బీరువాలో ఉండగా, కాళ్లు, చేతులు స్టీల్ వాటర్ క్యాన్‌లో కనిపించాయి. అయితే తాజాగా పోలీసులు మృతురాలు వీణాజైన్ శరీర భాగాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో దుర్వాసన రావడంతో పాటు చెల్లాచెదురుగా వస్తువులు పడి ఉండటంతో కూతురు రింపుల్‌ ప్రకాష్ జైన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

22 సంవత్సరాల యువతి రింపుల్ ప్రకాష్ జైనే తల్లి వీణా జైన్‌ని హత్య చేసి ఉంటుందన్న అనుమానంతో విచారణ నిమిత్తం అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి శరీర భాగాల్ని పోస్ట్‌ మార్టంకు తరలించారు. అనంతరం వివరాలు సేకరించారు. మృతురాలి కూతురు రింపుల్ ప్రకాష్ జైన్‌ను ప్రశ్నించిన పోలీసులకు యువతి పొంతన లేని సమాధానం చెప్పింది. తన తల్లి రెండు నెలల క్రితం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కిండపడితే ఇద్దరు పైకి తీసుకొచ్చి వెళ్లిపోయారని చెప్పింది. భయంతోనే ఎవరికి చెప్పలేదని సమర్దించుకుంది. అపార్ట్మెంట్ వాసులు గత రెండు నెలలుగా మృతురాలు వీణాజైన్‌ను తాము చూడలేదని ఆమె సోదరుడికి చెప్పడంతో కాలాచౌకి పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చాడు.

 

మిస్సింగ్ నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని సుమారు రెండు నెలల తర్వాత స్వాదీనం చేసుకున్నారు. ఇరుగుపొరుగు వారితో మాట్లాడారు. ఎలా చనిపోయింది కూతురు ఏమైనా హత్య చేసిందా అనే కోణంలో ఆరా తీసారు. మహిళ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పంపారు. పోస్ట్‌మార్టం రిపోర్ట్ కోసం ఎదురుచూస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు. అయితే మృతురాలి కుమార్తె తల్లి శరీర భాగాలు వాసన రాకుండా ఉండేదుకు సుమారు 200రకాల పర్‌ఫ్యూమ్స్, ఎయిర్‌ ఫ్రెషనర్‌ స్ప్రేలు తెప్పించి వాటిపై పూసిందని తేలింది. తల్లి శరీర భాగాలు పెట్టిన గదిలోనే రింపుల్ ప్రకాష్ జైన్ కూర్చొని ఉండటం, పోలీసులకు అబద్దం చెప్పడం వంటి అంశాల్ని పోలీసులు సునిశితంగా గమనిస్తున్నారు. అయితే వీణాజైన్‌ను డిసెంబర్‌లో హత్య చేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

TDP: ఆ 4 నియోజకవర్గాలలో అభ్యర్థులను మారుస్తున్న టీడీపీ.. మార్పుతో గెలుపు ఖాయమా?

TDP: మే 13వ తేదీ ఏపీ సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా మే 13వ తేదీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ప్రచార కార్యక్రమాలు కూడా మొదలయ్యాయి. అలాగే...
- Advertisement -
- Advertisement -