Naveen Murder Case: నవీన్ కేసులో యువతీ బంధువు ఆడియో లీక్?

Naveen Murder Case: అబ్దుల్లాపూర్‌మెట్‌ బీటెక్‌ విద్యార్థి నవీన్‌ హత్య కేసు ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఈ కేసులో ఒకదాని తర్వాత ఒకటి సంచలన విషయాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.. నవీన్ రెడ్డి హత్యకేసులో మొదటి నుంచి ప్రధానంగా యువతి పేరు బలంగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా నవీన్ ను హరిహర హత్య చేయడం వెనుక యువతి పాత్ర కూడా ఉంది అని ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. కాగా హరి తండ్రి కూడా తన కుమారుడు ఒక్కడే ఈ దారుణానికి పాల్పడలేదని, యువతి ప్రోత్సాహం కూడా ఉందని ఆమె పాత్రపై దర్యాప్తు చేయాలని పోలీసులను కోరాడు.

దాంతో హరి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ కోణంలో కూడా దర్యాప్తును చేపడుతున్నారు. కాగా ఈ కేసులో యువతి ప్రధాన నిందితురాలు అని ఆరోపణలు పెరుగుతున్న నేపథ్యంలో యువతి బంధువు అంటూ ఓ వ్యక్తి మాట్లాడిన ఆడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఆ ఆడియో కాల్ లో ఆ వ్యక్తి మాట్లాడుతూ.. అబ్దుల్లాపూర్‌మెట్‌ నవీన్‌ హత్య కేసులో ప్రేమ వ్యవహారం కారణంగానే ఈ హత్య జరిగిందని, సదరు యువతి వల్లనే ఈ దారుణం చోటు చేసుకుందని ప్రచారం జరుగుతోంది. నేను యువతి బంధువుని. మా అమ్మాయి, హరి, నవీన్‌ ముగ్గురు ఇంటర్‌లో ఫ్రెండ్స్‌ మాత్రమే. దీనిలో ఎలాంటి ప్రేమ వ్యవహారం లేదు. నవీన్‌, హరిల మధ్య గొడవ కారణంగానే ఈ హత్య జరిగింది.

 

ఈ కేసుకు మా అమ్మాయితో ఏ సంబంధం లేదు అని తెలిపాడు. అలాగే దయచేసి ఇటువంటి అసత్యాలు ప్రచారం చేయకండి. మీడియా సంస్థలు, సోషల్‌ మీడియా సైట్లకు ఒక్కటే చెబుతున్నాము. మా అమ్మాయి ఫొటో ప్రచురించి అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. ప్రజలు ఇలాంటి ప్రచారాలు నమ్మకూడదు. ఆధారాలు లేకుండా మీడియా వారు ఆరోపణలు చేయకూడదు, ఫొటోలను రివీల్‌ చేయకూడదని కోరుతున్నాము. దర్యాప్తు సంస్థలు, పోలీసులు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. ఇది సెన్సిటీవ్‌ కేసు. అమ్మాయి పేరు, ఫొటోలు వాడకూడదని తెలిపారు. మేం కూడా నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటాం అని తెలిపాడు.

Related Articles

ట్రేండింగ్

Raghurama Krishnamraju: రఘురామ కృష్ణంరాజు కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తారా.. ఏ దిక్కు లేకపోతే అ పార్టీనే దిక్కవుతుందా?

Raghurama Krishnamraju: ఏపీలో రఘురామకృష్ణం రాజు ఏపీలో ప్రస్తుతం హాట్ టాపిక్ గా ఉన్నారు. నిజానికి గత నాలుగేళ్లు ఏపీ రాజకీయాల్లో ఆయన ట్రెండ్ అవుతూనే ఉన్నారు. వైసీపీ ఎంపీల పేర్లు గుర్తు...
- Advertisement -
- Advertisement -