Avatar 2: అవతార్-2 టికెట్ రేట్లు వింటే చుక్కలు కనిపిస్తున్నాయిగా?

Avatar 2: వరల్డ్ వైడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న హాలీవుడ్ సినిమా ‘అవతార్-2’. ప్రముఖ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 16వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా ఇంగ్లీష్‌తోపాటు ఏడు భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ విడుదలైంది. ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై భారీ అంచనాలే పెరిగాయి. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ఈ సినిమా చూడటానికి ప్రేక్షకులు ఎంతగానో ఆతురతగా ఎదురు చూస్తున్నారు.

 

 

అయితే ‘అవతార్’ మొదటి భాగం 2009లో విడుదలైంది. ఈ సినిమా బడ్జెట్ 237 మిలియన్ డాలర్లు కాగా.. బాక్సాఫీస్ వద్ద 2,923 బిలియన్లు వసూలు చేసింది. అవతార్-2 కూడా అదే స్థాయిలో కలెక్షన్లు రాబట్టనుందని సినీ ప్రముఖులు చెబుతున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమా టికెట్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. అయితే ఈ సినిమా చూడాలనుకుంటున్న ప్రేక్షకులకు మాత్రం విడుదలకు ముందే భారీ ఎదురుదెబ్బ తగిలింది. ప్రముఖ టికెట్ బుకింగ్ సైట్స్, యాప్స్ దేశంలోని ప్రధాన నగరాల్లోని థియేటర్లలో టికెట్ బుకింగ్స్ అందుబాటులో ఉంచాయి. ఐమ్యాక్స్ 3డీ, 4డీఎక్స్, 3డీ ఫార్మాట్‌లలో ఉన్న థియేటర్లలో సినిమా విడుదల చేస్తుండటంతో.. అవతార్-2ను చూసేందుకు ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

 

 

అయితే అడ్వాన్స్ బుకింగ్ అందుబాటులో ఉంచడంతో.. టికెట్ల ధరలు చూసిన ప్రేక్షకులు షాక్‌కు గురవుతున్నారు. బెంగళూర్‌లోని ఐమ్యాక్స్ 3డీ ఫార్మాట్ కలిగిన థియేటర్‌లో టికెట్ ధర రూ.1,450గా ఉంది. ఈ ధరలు చూసిన ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు. పూణెలో రూ.1,200, ఢిల్లీలో రూ.1000, ముంబైలో రూ.970, కోల్‌కతాలో రూ.770, అహ్మదాబాద్ రూ.750, ఇండోర్‌లో రూ.700, హైదరాబాద్‌లో రూ.350, విశాఖలో రూ.210 ధరలు చూపిస్తోంది. అయితే ఇవన్నీ ధరలు నార్మల్ సీట్లకు సంబంధించినవి. అయితే వీటితోపాటు అదనపు ఛార్జీలు, పన్నులు, ఇంటర్నెట్ ఛార్జీలంటూ అదనపు భారం పడనుంది. కాగా, అవతార్-2 సినిమాలో సామ్ వర్దింగ్టన్, సిగుర్నే వీవర్, జోయా సాల్దానా, కేట్ విన్స్ లెట్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -