Avika Gor: శుభవార్త చెప్పిన అవికా గోర్.. మార్పు రానుందంటూ?

Avika Gor: యావత్ దేశంలో ‘బాలికా వధు’ అంటూ, తెలుగులో ‘చిన్నారి పెళ్లికూతురు’ సీరియల్ తో ఎంతో పాపులారిటీని సంపాదించుకున్న స్టార్ అవికా గోర్. సినిమా హీరోయిన్లకు కూడా లేనంత రేంజ్.. సీరియల్స్ చేస్తున్నప్పుడే అవికా గోర్ కు ఉండేది. దేశవ్యాప్తంగా ఎన్నో కోట్ల మంది ఆమె చేసిన సీరియల్స్ చూడటంతో ఆమెకు మంచి గుర్తింపు లభించింది.

 

ఇక బుల్లితెర నుండి వెండి తెర మీదకు అరంగేట్రం చేసిన అవికా గోర్.. కెరీర్ ను ఓ మోస్తరుగా నెట్టుకొస్తోంది. భారీ అంచనాల మధ్య టాప్ హీరోయిన్ గా అవుతుందని అనుకున్న అవికా గోర్ కెరీర్.. ఏదో పర్లేదు అన్నట్లు సాగుతోంది. అయితే ప్రస్తుతం యూత్ ఫుల్ సినిమాల్లో హీరోయిన్ గా చేస్తున్న ఈ అమ్మడు తాజాగా చేసిన పోస్ట్ ఒకటి అందరిలో చర్చకు దారితీసింది.

 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటే అవికా గోర్.. తాజాగా షేర్ చేసిన ఓ పోస్ట్ అందరికీ ఆశ్చర్యం కలిగిస్తోంది. అవికా గోర్ చేసిన పోస్టులో సారాంశం ఏమిటంటే మార్పు రాబోతోంది అని. అంటే తన జీవితంలో మార్పు రాబోతోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అవికా గోర్ కు సంబంధించి రకరకాల ఊహాగానాలకు తెర లేచింది.

 

అవికా గోర్, మిలింద్ చంద్వానీ అనే వ్యక్తితో ఇప్పటికే లవ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుండగా.. ఈ ఏడాది ఆగష్టు 11న జమ్మూ కాశ్మీర్ లో ఇద్దరూ తమ రెండో వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ రెండింటికి లింక్ పెట్టిన నెటిజన్లు.. అవికా గోర్ త్వరలో తల్లి కాబోతోందని కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో ఎంత నిజం ఉందో, అవికా గోర్ లేదంటే మిలింద్ చంద్వానీలే క్లారిటీ ఇవ్వాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -