Bread: ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తింటే అవి పెరుగుతాయట!

Bread: ఉదయం లేవగానే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి బ్రేక్‌ఫాస్ట్‌ చేస్తారు. ఒకొక్కరు ఒక్కో ఆహారాన్ని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటారు. కొందరు దోశలు తింటే మరి కొందరు ఇడ్లీ, రోటీ తింటారు. ఉద్యోగాలు, పనుల నిమిత్తం తొందరగా బయటకు వెళ్లాలనే తొందరలో కొందరు బ్రేడ్‌తో తయారు చేసి వాటిని బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకుంటుంటారు. అయితే.. పరిగడుపున బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రేడ్‌ తినడం చాలా ప్రమాదమని ఆహార నిపుణులు హెచ్చరిస్తుంటారు. ఉదయం, ఉదయం బ్రెడ్‌ తినడంతో వివిధ రకాల అనారోగ్య సమస్యలు వెంటాడుతాయని పేర్కొంటున్నారు.

బ్రెడ్‌ లో పిండి పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. పోషకాలు అసలు ఉండవు. దీని గ్లైసీమిక్‌ ఇండెక్స్‌ (జీఐ) విలువ కూడా ఎక్కువ. కాబట్టి బ్రెడ్‌ తిన్న వెంటనే షుగర్‌ లెవల్స్‌ అమాంతం పెరిగిపోతాయట. ఇలా తరచూ బ్రెడు తింటుంటే టైప్‌–2 డయాబెటిస్‌ బారిన పడే అవకాశాలు ఉంటాయి. కనుక ఉదయం పరగడుపున బ్రెడ్‌ తినరాదు. అంతేకాక బ్రెడ్‌ను తినడం వల్ల షుగర్‌ లెవల్స్‌ పెరిగి ఇన్సులిన్‌ నిరోధకత వస్తుంది. దీంతో ఆకలి బాగా అవుతుంది. ఫలితంగా అధికంగా తింటారు. ఇది అధిక బరువుకు కారణమవుతుంది. కనుక ఉదయం బ్రెడ్‌ తినడం మానేసే బాగుంటుందని నిపుణులు సూచిస్తున్నారు.

బ్రెడ్‌లో పిండి పదార్థాలు అధికంగా ఉండటంతో ఇవి జీర్ణం అయ్యేందుకు సమయం పడుతుంది. కనుక ఉదయం బ్రిడ్‌ ను పరగడుపున తింటే అది జీర్ణం కాక మలబద్ధ్దకం వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే. బ్రిడ్‌ సోడియం అధికంగా ఉంటుంది. సోడియం అధికంగా ఉండే ఆహారాలను ఉదయం తినడం ద్వారా కిడ్నీలపై భారం పడుతుంది. కనుక ఎటు చూసినా బ్రెడ్‌ వల్ల నష్టాలే ఉన్నాయి కానీ లాభాలు లేవు. కాబట్టి ఉదయం పరగడుపున బ్రెడ్‌ను తినడం ఆరోగ్యానికి హానికరం. అన్ని రకాల పోషక విలువలున ఆహార పదార్థలు బ్రేక్‌ ఫాస్ట్‌లో తీసుకుంటే రోజంతా ఉల్లాసంతో పాటు, ఆరోగ్యం, ఎలాంటి రోగాల దరిచేరవని ఆహార నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -