Health Tips: వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఇవి తినకూడదట… ఇదే కారణం!

Health Tips: వర్షాకాలంలో కొన్ని రకాల కూరగాయలు తింటే అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ప్రస్తుతం అప్పుడప్పుడు వర్షాలు కురుస్తుండటంతో వాతావరణం చల్లబడుతోంది. ఈ క్రమంలో కొన్ని కూరగాయలు తినకపోవడమే మందిదంటున్నారు. ఆరోగ్య నిపుణులు. అయితే వాతావరణం చల్లబడినప్పుడు ఎలాంటి కూరగాయలు తినాలో చాలా మందికి తెలిదు. వాతావరణాన్ని బట్టి ఆహారం తీసుకోవాలని వైద్యులు సూచిస్తుంటారు. వాతావరణం వేడిగా ఉన్నప్పుడు చలువ చేసే ఆహారాన్ని, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు శరీరంలో వేడి పుట్టించే ఆహారాన్ని తినమని వైద్యులు చెబుతుంటారు. చల్లగాలులు చూస్తున్నప్పుడు కొన్ని రకాల కూరగాయలను దూరంగా పెట్టాలి.

క్యాప్సికం..

చాలా తక్కువ ఖరీదుతో పేదవారికి అందుబాటులో ఉండే కూరగాయ ఇది. తింటే చాలా మంచిది. కానీ వానాకాలంలో తినకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే వీటిల్లో కూడా గ్లూకోసినోలేట్లు ఉంటాయి. అవి నమిలినప్పుడు ఐసోథియోసైనేట్లుగా మారుతాయి. వీటి వల్ల కొందరిలో అతిసారం, వాంతులు, వికారం, శ్వాస సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ కూరగాయని చినుకులు పడుతున్న సమయంలో తినకపోవడమే మంచిది.

ఆకుకూరలు..

ఆరోగ్యానికి ఆకుకూరలు చాలా అవసరం. కానీ వానలు పడుతున్నప్పుడు, వాతావరణం మరీ చల్లగా ఉన్నప్పుడు వీటిని తినడం తగ్గిస్తే మంచిది. పచ్చని ఆకుకూరలపై సూక్ష్మజీవులు, బ్యాక్టీరియా త్వరగా పెరుగుతాయి. ఆకులపైనే సంతానోత్పత్తి చేస్తాయి. దీనికి ఆకులు కలుషితమయ్యే ప్రమాదం అధికం. కడుగుతున్నాం కదా అనుకుంటారు కానీ, ఆ సూక్ష్మమైన జీవులు ఆకులను పట్టి ఉంటాయి. కొన్ని కడిగినా పోవు. వాటిని అలానే తినడం వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి.

క్యాబేజీ..

క్యాబేజీ(ఫూల్‌ గోబి)ని భారతీయ వంటకాల్లో విరివిగా వాడతారు. వెజ్‌ బిర్యానీలో ఎక్కువగా ఉపయోగిస్తారు. కూరలు, వేపుళ్లు, గోబీ మంచూరియా, పకోడి, ఇలా దీనితో రకరకాల వంటకాలు చేస్తారు. అయితే దీన్ని వర్షాకాలంలో మాత్రం తినరాదని వైద్యులు సూచిస్తున్నారు. వాటిలో గ్లూకోసినోలేట్స్‌ అనే రసాయన సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి వాతావరణం చల్లగా ఉన్నప్పుడు అలెర్జీలు వచ్చేలా చేస్తాయి. అలాగే పురుగులు కూడా అధికంగా పడతాయి. కాలీఫ్లవర్‌ మీదే అవి సంతానోత్పత్తిని పెంచుకుంటాయి. అందుకు వాతావరణం చల్లబడినప్పుడు ఇలాంటి కూరగాయాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -