Axar Patel: అక్షర్ పటేల్ ధనాధన్ ఇన్నింగ్స్.. అయినా భారత్‌కు తప్పని ఓటమి

Axar Patel: పూణె వేదికగా భారత్‌తో జరిగిన రెండో టీ20లో శ్రీలంక 16 పరుగుల తేడాతో ఉత్కంఠభరిత విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన టీమిండియా టాపార్డర్ విఫలం కావడంతో పరాజయం తప్పలేదు. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక దంచికొట్టింది. 20 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 206 పరుగుల భారీ స్కోరు సాధించింది.

 

శ్రీలంక ఇన్నింగ్స్‌ ఆది నుంచి ధాటిగానే సాగింది. ఓపెనర్లు కుశాల్ మెండిస్(52), పాతుమ్ నిస్సంక(33) అదిరిపోయే ఆరంభాన్ని అందించారు. అనంతరం కెప్టెన్ డసన్ షనక (22 బంతుల్లో 2 ఫోర్లు, 6 సిక్స్‌లతో 56 నాటౌట్) విధ్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు. భారత బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ మూడు వికెట్లు తీయగా.. అక్షర్ పటేల్ రెండు వికెట్లు పడగొట్టాడు. యుజ్వేంద్ర చాహల్ ఓ వికెట్ తీశాడు.

 

అనంతరం 207 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. రెండో ఓవర్లోనే ఇషాన్ కిషన్ కేవలం రెండు పరుగులకే పెవిలియన్ చేరాడు. అదే ఓవర్‌లో మరో ఓపెనర్ శుభ్‌మన్ గిల్‌ కూడా అవుటయ్యాడు. మూడో ఓవర్ మొదటి బంతికే రాహుల్ త్రిపాఠి (5) కూడా అవుట్ కావడంతో భారత్ కష్టాల్లో పడింది. కాసేపట్లోనే కెప్టెన్ హార్దిక్ పాండ్య(12) కూడా పెవిలియన్ చేరాడు. దీపక్ హుడా (9) కూడా విఫలం కావడంతో టీమిండియా ఇన్నింగ్స్ పరాజయం వైపు సాగింది.

 

అనూహ్యంగా చెలరేగిన అక్షర్ పటేల్
57 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ టీమిండియాకు అక్షర్ పటేల్ ఆశలు కల్పించాడు. అతడు సూర్యకుమార్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. సిక్సర్‌తో పరుగుల ఖాతాను తెరిచిన అక్షర్ పటేల్ అదే జోరు కొనసాగించాడు. 20 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించాడు. 31 బంతుల్లో ఆరు సిక్సర్లు, మూడు ఫోర్లతో 65 పరుగులు చేసిన తర్వాత కీలక దశలో అవుటయ్యాడు. సూర్యకుమార్‌తో కలిసి ఆరో వికెట్‌కు 91 పరుగుల భాగస్వామ్యం అందించాడు. చివరి ఓవర్‌లో 21 పరుగులు అవసరం కాగా భారత్ 4 పరుగులు మాత్రమే చేసింది. దీంతో 16 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ విజయంతో శ్రీలంక మూడు టీ20ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -