ఇదేం అభిమానం రా సామి.. అన్నప్రాసన రోజే బుడ్డోడు చేసిన పని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

మనదేశంలో సినిమా సెలబ్రిటీలకు రాజకీయ నాయకులకు ఎంతో మంది అభిమానులు ఉంటారు. వీరి కోసం అభిమానులు ప్రాణాలు కూడా ఇవ్వడానికి ఏమాత్రం వెనకాడరు. ఇకపోతే కొంతమంది తమ అభిమాన హీరోలు రాజకీయ నాయకుల పేర్లను వారి పిల్లలకు పెట్టడం మనం చూస్తుంటాము.అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం వైఎస్ఆర్సిపి పార్టీకి ఎంతో క్రేజ్ ఉంది. ఈ క్రమంలోనే ఓ వైసీపీ అభిమాని ఇంట్లో జరిగిన వేడుకకు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సాధారణంగా ఇంట్లో బిడ్డ పుట్టిన తర్వాత ఆరు నెలలకు అన్నప్రాసన కార్యక్రమం చేసి వారికి అన్నం తినిపించడం మొదలు పెడతాము ఈ సాంప్రదాయం ఎన్నో సంవత్సరాల నుంచి కొనసాగుతుంది. అయితే అన్నప్రాసన కార్యక్రమంలో భాగంగా బిడ్డ భవిష్యత్తులో ఏం కాబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం తన ముందు పుస్తకాలు, బంగారం, నగలు, డబ్బు, పెన్ను, కత్తి వంటి వాటిని ఉంచుతారు. ముందుగా బిడ్డ ఏ వస్తువు తాగితే తన భవిష్యత్తు అలా ఉండబోతుందని భావిస్తారు.

ఇకపోతే ఈ వీడియోలో భాగంగా కుటుంబ సభ్యులు ఈ వస్తువులతో పాటు వైఎస్సార్సీపీ కండువా కూడా పెట్టారు.అయితే ఈ అన్నప్రాసన కార్యక్రమంలో భాగంగా ఆ చిన్నారి అక్కడ ఉన్నటువంటి ఏ వస్తువులను తాకకుండా సరాసరి వైఎస్ఆర్సిపి కండువా దగ్గరకు వచ్చి దానిని చేతితో లాగాడు. ఇది చూసిన ఆ కుటుంబ సభ్యులు ఎంతో మురిసిపోయారు. ఈ క్రమంలోనే ఈ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఈ వీడియో క్షణాల్లో వైరల్ గా మారింది.

ఇక ఈ వీడియో ఎక్కడ జరిగింది ఏంటి అనే విషయం తెలియకపోయినా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతో మంది వైసీపీ అభిమానులు ఇదేం అభిమానం రా సామి చిన్నోడికి కూడా పార్టీపై ఇంత అభిమానమా అంటూ కామెంట్లు చేయడమే కాకుండా బుడ్డోడు చూపిస్తున్న అభిమానానికి అభిమానులు ఫీదా అవుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -