Bahubali Singer: త్వరలో పెళ్లి పీటలెక్కనున్న ‘బాహుబలి’ సింగర్.. ఫొటోలు వైరల్

Bahubali Singer: ప్రముఖ సింగర్ సత్య యామిని త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారు. వరుస సినిమాల్లో పాటలు పాడుతూ కెరీర్ లో జెట్ స్పీడుతో దూసుకెళ్తున్న యామిని.. సోషల్ మీడియా వేదికగా తనకు కాబోయే భర్తను పరిచయం చేస్తూ తాజాగా ఓ పోస్ట్ పెట్టారు. పాన్ ఇండియా హిట్ ‘బాహుబలి’ సినిమాలోని ‘మమతల తల్లి’ పాటతో గాయనిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యామిని.. త్వరలో వివాహ బంధంలోకి అడుగిడనున్నారు.

రోలర్ కోస్టర్ వెయిటింగ్
కాబోయే భర్త గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు సత్య యామిని. ‘జీవితకాలానికి సంబంధించిన రోలర్ కోస్టర్ వేచి ఉంది’ అని ఈ పోస్టుకు శీర్షికగా రాసుకొచ్చారామె. ఈ ఫొటో చూసిన గీతామాధురి, అనుదీప్, మనీషా, పూజాతోపాటు పలువురు ఇతర సింగర్స్ ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

జోడీ అదుర్స్ అంటూ కామెంట్స్..
కాబోయే భర్తతో యామిని ఉన్న ఫొటోలను చూసిన సెలబ్రిటీలు, సాధారణ ప్రేక్షకులు.. వీళ్లిద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అని.. క్యూట్ కపుల్స్అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే, తనకు కాబోయే వాడికి సంబంధించిన వివరాలను మాత్రం యామిని వెల్లడించకపోవడం గమనార్హం.

ఇకపోతే, ప్రముఖ టెలివిజన్ చానల్ లో ప్రసారమయ్యే ‘పాడుతా తీయగా’, ‘స్వరాభిషేకం’ లాంటి కార్యక్రమాలతో యామిని తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యారు. ‘బాహుబలి-2’ మూవీ తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి. ‘శైలజారెడ్డి అల్లుడు’, ‘కొండపొలం’, ‘రాధేశ్యామ్‌’, ‘అఖండ’, ‘బింబిసార’, ‘అహింస’ వంటి సినిమాల్లో ఆమె పలు గీతాలను ఆలపించారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -