Balakrishna: అఖండ ఎఫెక్ట్… బాలయ్య పారితోషికం ఎంత పెరిగిందంటే?

Balakrishna: అఖండ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక విధంగా చెప్పాలంటే అఖండ తరువాత అఖండకి ముందు అన్నట్టుగా పరిస్థితులు మారిపోయాయి. లెజెండ్ తర్వాత అంతటి విజయాన్ని సాధించిన సినిమాగా అఖండ ని చెప్పుకోవచ్చు. దాదాపు విజయం కోసం ఆరు సంవత్సరాలు వేచి చూడాల్సి వచ్చింది.

ఇక అఖండ సినిమాతో 100 కోట్ల క్లబ్ లో చేరిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే అఖండతో అభిమానులకి అందించాల్సిన మాస్ ట్రీట్ ని అందించేసాడు. బోయపాటి మరియు బాలకృష్ణ కాంబినేషన్ లో సినిమా అంటే ఆ మాత్రం ఉంటుంది మరి. ఈ సినిమా పూర్తి స్థాయి విజయం సాధించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంగీతం పరంగా చూసుకున్నా, డైలాగ్స్ పరంగా చూసుకున్నా, కథ పరంగా చూసుకున్నా ఇది తక్కువ అన్నట్టు మాత్రం కనిపించలేదు.

అందుకే ఈ సినిమా అంతటి ఘన విజయం సాధించింది. ఇక ఈ సినిమా తర్వాత బాలకృష్ణ పారితోషికం కూడా పెంచేసాడట. ఇప్పటి వరకు బాలకృష్ణ 8 కోట్ల పారితోషికం తీసుకుంటుండగా, తన తర్వాతి సినిమా అయిన వీరనరసింహా రెడ్డికి ఏకంగా 12 కోట్లు తీసుకుంటున్నాడట. బాలయ్య మరియు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కి కూడా పారితోషికం పెంచేసాడట. నిజం చెప్పాలంటే ఇతర హీరోలతో పోల్చుకుంటే బాలయ్య రెమ్యూనిరేషన్ తక్కువే చెప్పుకోవచ్చు.

టాలీవుడ్ టాప్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లో మెగాస్టార్ చిరంజీవి మాత్రమే అత్యధిక పారితోషికం తీసుకుంటున్నాడట. ఇక బాలయ్య బాబు సినిమా అయిన వీర నరసింహా రెడ్డి సంక్రాంతి కానుకగా రాబోతుంది. దాదాపు రెండు సంవత్సరాల తర్వాత ఈ చిత్రం రానుండడంతో వీర నరసింహా రెడ్డి పై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

 

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -