Balakrishna: సంక్రాంతి విజేత బాలకృష్ణనే…సాక్ష్యాలివే…

Balakrishna: సాధారణంగా టాలీవుడ్ టాప్ హీరోల సినిమాలు వస్తున్నాయంటే వాళ్ళ మధ్య పోరు ఉండడం కామనే. ఇక అభిమానులు చేసే సందడి అంతా ఇంతా కాదు. మా హీరో సినిమా బాగుంది అంటే మా హీరో సినిమా బాగుంది అంటూ థియేటర్లలో వాళ్ళు చేసే అల్లరి అంతా ఇంతా కాదు. అయితే హీరోల మధ్య మాతం ఎప్పటికి పోరు ఆరోగ్యకరంగానే ఉంటుంది. అయితే ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాలలో పోటీ ని చూస్తే టీవీలలో వచ్చిన రేటింగ్ ని బట్టి కూడా లెక్కలు కట్టేస్తున్నారు అభిమానులు.

 

అయితే చిరంజీవి ఆచార్య సినిమా థియేటర్లలో ఆడలేదని అందరికి తెలిసిన విషయమే. కానీ టీవిలో మాత్రం 6.3 రేటింగ్ ని సాధించిందని చిరు అభిమానులు తమ ఆనందాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. అయితే ఇదంతా బాగానే ఉంది కానీ వేయిరి మధ్యలో బాలయ్య అభిమానులు ఎంటరయ్యారు. అయితే టీవిలో వచ్చిన బాలయ్య సినిమా అఖండ కి మాత్రం రేటింగ్ 13 పైనే వచ్చింది.

 

దీనితో పోల్చుకుంటే చిరు సినిమాకి అఖండ సినిమాలో సగం కూడా రాలేదు. దీనితో పాటు ఎఫ్3 సినిమాతో కూడా చిరు సినిమాని పోల్చారు. ఎఫ్3 సినిమాకి 8.0 రేటింగ్ వచ్చింది. ఇదంతా చూస్తూ ఉంటే రాబోయే సంక్రాంతి కి పోరు బాగానే ఉండేట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే బాలయ్య, చిరు కొత్త సినిమాలు వీరనారసింహ రెడ్డి మరియు వాల్తేరు వీరయ్య సినిమాలు రాబోతున్నాయి. అయితే ఇక అభిమానుల మధ్య సందడి మాత్రం మాములుగా ఉండేలా లేదు.

 

ఇక బాలకృష్ణ అభిమానులు అయితే ఇంతకు ముందు వచ్చిన సినిమాలు పోల్చుకుని ఈసారి కూడా బాలకృష్ణ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక చిరు అభిమానులు ఊరుకుంటారా ఈసారి వాల్తేరు వీరయ్యతో మాస్ పండగ గ్యారంటీ అంటూ బాలయ్య అభిమానులకి కౌంటర్ ఇచ్చారు. ఇక ఇది ఇప్పట్లో తేలేలా లేదు. ఇక ఇది తేలాలంటే మనం కూడా సంక్రాంతి వరకు వేచి చూడాల్సిందే.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -