Balakrishna Daughters: బాలయ్య, వెంకీ కూతుళ్లను హీరోయిన్లను చేయకపోవడానికి కారణమిదే?

Balakrishna Daughters: సినిమా ఇండస్ట్రీలో చాలా మంది హీరోలు తమ వారసులను తెరమీదకు తెచ్చారు. సీనియర్ ఎన్టీఆర్ మొదలుకొని అక్కినేని, దగ్గుబాటి ఫ్యామిలీ, చిరంజీవి ఫ్యామిలీ.. ఇలా చాలా మంది వారసులను నటనవైపు మళ్లించారు. సీనియర్ ఎన్టీఆర్ తనయులు హరికృష్ణ, బాలకృష్ణలు సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకున్నారు. బాలయ్య నేటికీ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. హరికృష్ణ చనిపోక ముందు కూడా చాలా చిత్రాల్లో నటించారు. ఇక ఆయన వారసులు కూడా జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ హీరోలుగా రాణిస్తున్నారు.

ఇక అక్కినేని ఫ్యామిలీలో కూడా నాగేశ్వర రావు తర్వాత అక్కినేని నాగార్జున టాప్ హీరోల్లో ఒకడిగా వెలుగొందారు. ఆయన తనయులు నాగచైతన్య, అఖిల్ కూడా ప్రస్తుతం హీరోలుగా ఉన్నారు. మరోవైపు సింగిల్ గా ఇండస్ట్రీకి వచ్చి మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది హీరోలయ్యారు. ఇక వారసుల విషయం అలా ఉంచితే.. కుమార్తెల విషయంలో హీరోల వైఖరి భిన్నంగా ఉంటోంది.

ఇండస్ట్రీకి దూరంగా ఉంచుతున్నారా?

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లుగా కొనసాగితే ఫ్యాన్స్ నుంచి విమర్శలు వచ్చే ఛాన్స్ ఉండటంతో పాటు ఎఫైర్లకు సంబంధించిన వార్తలు వస్తాయనే భయంతో హీరోలు తమ కూతుళ్లను సినిమా రంగానికి దూరంగా ఉంచుతున్నారనే వాదన ఉంది. ఈ కోవలోకే బాలయ్య, వెంకీ వస్తారని సినిమా నిపుణులు చెబుతున్నారు. బాలయ్యకు ఇద్దరు కుమార్తెలు. కుమార్తెలు తేజస్విణి, బ్రాహ్మణి. బ్రాహ్మణిని చంద్రబాబు తనయుడు లోకేష్ వివాహం చేసుకున్నారు. మరో కుమార్తె తేజస్విణిని భరత్ పెళ్లి చేసుకున్నారు.

కొన్నాళ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో బాలయ్య అల్లుడు భరత్ ఈ విషయంపై స్పందించారు. ఇండస్ట్రీలోకి రావాలని చాలా మందికి ఉంటుందన్నారు. అయితే, బాలయ్య కుమార్తెలు రావడం అనేది తమ కుటుంబ వ్యవహారమని చెప్పారు. కుటుంబంలోని కొన్ని కారణాల వల్ల సినీ రంగంలోకి పంపడం లేదన్నారు. ఇక విక్టరీ వెంకటేశ్ కూతుళ్ల విషయం కూడా ఇదే విధానం అవలంబిస్తున్నారు. వెంకటేశ్ కు ముగ్గురు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. ముగ్గురు కుమార్తెలనూ ఇండస్ట్రీకి దూరంగా ఉంచారు.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts