Balakrishna: ఆ స్టార్ డైరెక్టర్ తో బాలయ్య ప్రాజెక్ట్ ఇప్పట్లో లేనట్టేనా?

Balakrishna: నటసింహం నందమూరి బాలయ్య ప్రస్తుతం తెలుగు ఓటీటీ ఆహాలో ప్రసారమవుతున్న అన్ స్టాపబుల్ షోతో బిజీగా ఉన్నాడు. రెండో సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. ప్రముఖులను షోకు ఆహ్వానించి బాలయ్య మంచి ఎంటర్ టైన్ మెంట్ అందిస్తున్నాడు. మరోవైపు డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటిస్తున్నాడు. ఈ సినిమాకు వీరసింహారెడ్డి గా పేరు ఇటీవలే కర్నూలు కొండారెడ్డి బురుజుపై ప్రకటించారు.

 

ప్రముఖ డైరెక్టర్ అనిల్ రావిపూడితో బాలయ్య ఓ చిత్రాన్ని తీయబోతున్నారు. ఈ సినిమాకు ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయ్యిందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్ నవంబర్ లోనే ప్రారంభం కావాల్సి ఉన్నా బాలయ్య బిజీ కారణంగా ప్రాజెక్టు పట్టాలెక్కడం లేటవుతోందట. దీంతో సినిమా షూటింగ్ ఇప్పట్లో ప్రారంభం అవుతుందా లేదా అనే సందేహాలు మొదలయ్యాయి.

 

జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్..
అన్ స్టాపబుల్ షో పూర్తయ్యాక బాలయ్య సినిమా షూటింగుల్లో పాల్గొంటారని తెలుస్తోంది. ఆలోపు వీరసింహారెడ్డి చిత్రం కూడా రిలీజ్ అవుతుంది కాబట్టి తదుపరి చిత్రం ఆ జోష్ లో ఉత్సాహంగా చిత్రీకరణ చేయొచ్చని భావిస్తున్నారు. సంక్రాంతి తర్వాత అనిల్ రావిపూడి, బాలయ్య ప్రాజెక్టు మొదలయ్యే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. తండ్రీ కూతుళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఈ కథ కొనసాగుతుందట. ఈ చిత్రంలో బాలయ్య హీరోయిన్ గా బాలీవుడ్ భామ నటిస్తోందని తెలుస్తోంది. విలన్ రోల్ లో కూడా బాలీవుడ్ నుంచే నటుడిని రప్పిస్తున్నారు. దీంతో సినిమాకు మరింత క్రేజ్ ఏర్పడుతుందని సినిమా యూనిట్ భావిస్తోంది.

 

కూతురు పాత్రకు నటి శ్రీలీలను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. సినిమాకు రామారావుగారు అనే టైటిల్ అనుకుంటున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాలు గుసగుసలాడుతున్నాయి. సినిమాకు నేపథ్య సంగీతం ఎస్ఎస్ థమన్ అందిస్తున్నారట. షూటింగ్ ప్రారంభం అయ్యేలోపే బాలయ్య లుక్ ను విడుదల చేయాలని డైరెక్టర్ భావిస్తున్నారట.

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts