Unstoppable Season 2: అన్ స్టాపబుల్2 షోతో బాలయ్య సంచలన రికార్డ్.. ఆయనకే సాధ్యమంటూ?

Unstoppable Season 2: టాలీవుడ్ ప్రేక్షకులకు నందమూరి బాలకృష్ణ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ప్రస్తుతం యువ హీరోలతో సమానంగా ఆయన సినిమా అవకాశాలు అందుకుంటూ తెలుగు ఇండస్ట్రీలో అగ్రస్టార్ హీరోగా వెలుగుతున్నాడు. ఇక బాలయ్య అన్ స్టాపబుల్ అనే టాక్ షో గతంలో మొదలుపెట్టారు. ఈ షో మొదటి ఎపిసోడ్ ఎప్పుడు మొదలైందో అప్పటినుంచి ఆ షోకి బాగా క్రేజ్ పెరిగిపోయింది.

ప్రతి ఎపిసోడ్ ను బాలయ్య తన అద్భుతమైన మాటలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. మొత్తంగా బాలయ్య అన్ స్టాపబుల్ షో బాగానే క్లిక్ అయింది. ఇప్పుడు అన్ స్టాపబుల్ సీజన్ 2 త్వరలో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ సీజన్ వచ్చిన తర్వాత బాలకృష్ణకు వెండితెరపై ఇటు బుల్లితెరపై బాగానే క్రేజ్ పెరిగిపోయింది. కాగా ఇప్పుడు సీజన్ 2 కోసం భారీ స్థాయిలో ఏర్పాటు చేస్తున్నారట. టాలీవుడ్ హిస్టరీలోనే ఓటీటీ కార్యక్రమానికి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది.

ఈ ఈవెంట్ కి దాదాపు 30 వేల మందికి పైనే జనాలు వస్తారన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ భారీ సభకు భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో ఈ సీజన్ టు ట్రైలర్ షూట్ చేసినట్లు తెలుస్తుంది. ఆ షూట్ లో బాలయ్య డిఫరెంట్ గెటప్ లో పాల్గొన్నట్లు తెలుస్తుంది. బాలయ్య కు సంబంధించిన ఈ స్టిల్స్ కొన్ని సోషల్ మీడియా ద్వారా కూడా బయటకు వచ్చాయి. ఇక సీజన్ 2 మాత్రం భారీ స్థాయిలో హిట్ అవ్వాలని ఆహా ఎంతో పకడ్బందీగా ప్లాన్ చేస్తుంది.

అంతేకాకుండా సీజన్ 2 లో చంద్రబాబు, లోకేష్, త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ లాంటి క్రేజీ కాంబినేషన్లు సెట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇక బాలయ్య మొదటి సీజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. మరి ఈ సీజన్ 2 ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాల్సి ఉంది. ఏదేమైనా సీజన్ 2తో కూడా బాలకృష్ణ సరికొత్త రికార్డులు క్రియేట్ చేసుకున్నట్లు తెలుస్తుంది.

Related Articles

ట్రేండింగ్

AP Electricity: ఏపీలో విద్యుత్ కోతలు మొదలు.. పవర్ కట్ వల్ల జగన్ పవర్ కట్ అయ్యే ఛాన్స్ ఉందా?

AP Electricity: ఏపీలో కరెంటు కోతలు అనే మాట ఓ తరానికి ముందు విన్నాం. ఇప్పుడు అలాంటి మాట వినాల్సిన పని లేదనే అనుకుంటాం. పైగా రాష్ట్ర విభజన తర్వాత కరెంటు కోతలు...
- Advertisement -
- Advertisement -