Balakrishna-Gopichand Malineni: బాలయ్య సినిమాలోని పాట లీక్.. ఇదిగోండి వీడియో!

Balakrishna-Gopichand Malineni: నందమూరి చందమామ బాలకృష్ణ మంచి జోరు మీద ఉన్నారు. ఆయన హోస్ట్ గా వ్యవహరించిన అన్ స్టాపబుల్(Unstoppable With NBK) ప్రేక్షకులని అలరించింది. బాలయ్య బాబు ‘అఖండ’ కూడా బాక్సాఫీస్ వద్ద అఖండ విజయం సాధించింది. అదే జోష్ తో బాలయ్య బాబు తన తదుపరి చిత్రం “NBK107”తో బిజీగా ఉన్నారు. ఇటీవల విడుదలయిన టీజర్ అభిమానుల అంచనాలను అమాంతంగా పెంచేసింది. అఖండని మించిన విజయం సాధిస్తుందని వాళ్ళ నమ్మకం.

అయితే ఈ చిత్రానికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. నెటిజన్లు, బాలయ్య బాబు అభిమానులు ఈ పాట NBK107 లోది అని నమ్ముతున్నారు. దీనికి తగ్గట్టుగా బాలయ్య వేషధారణ టీజర్ లో ఉన్నట్టుగానే ఉంది. లేడీ డ్యాన్సర్లతో పాటుగా బాలయ్య బాబు డ్యాన్స్ చేశారు. అభిమానులు ఈ మాస్ స్టెప్పులకి పరవశించిపోతున్నారు. సింహం జూలు విదిలించింది అని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.

ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న వీడియోలో “సుగుణ సుందరి.. సుగుణ సుందరి.. సుర సుర చూపుల రంగేళి” అనే పాట వినిపిస్తుంది. డ్యాన్స్ స్టెప్స్ వేసిన తరువాత వన్ మోర్, ఇమీడియేట్లీ వన్ మోర్ అనే పదాలు వినొచ్చు. ఆ మాటలు డ్యాన్స్ మాస్టర్ వి అయి ఉండవచ్చు అనేది నెటిజన్లు బలంగా నమ్ముతున్నారు.

“NBK107” వర్కింగ్ టైటిల్ గా ఉన్న సినిమాని మాస్ సినిమాలకి కేరాఫ్ అడ్రస్ అయిన గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నారు. వరుస విజయాలతో జోరు మీదున్న మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కమల్ తనయ శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. శృతిహాసన్ తోలి సారి బాలయ్య బాబు సరసన నటిస్తుంది. అబ్బాయి తారక్ పక్కన నటించిన శృతిహాసన్ బాబాయి బాలకృష్ణ సరసన నటిస్తుంది. ఎన్నో అంచనాలతో వస్తున్న ఈ చిత్రం తెలుగు సినిమాలకి పెద్ద సీజన్ అయిన సంక్రాంతికి వచ్చే అవకాశాలు ఉన్నాయి.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -