Balakrishna: ఇతర రాష్ట్రాల్లో కూడా రికార్డులు బాలయ్యకే సాధ్యమా?

Balakrishna: నందమూరి బాలకృష్ణ సినిమా వస్తుంది అంటే చాలు అభిమానులకు పండుగే. కథ ఏ విధంగా ఉన్నా సరే బాలయ్య నోటి నుంచి వచ్చే డైలాగులకు ఫాన్స్ చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆయన ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ నుంచి ఎన్నో రికార్డులను సృష్టించాడు. మంగమ్మ గారి మనవడు, బంగారు బుల్లోడు, ముద్దుల మావయ్య, సమర సింహా రేడ్డి, నరసింహ నాయుడు, తాజాగా అఖండ చిత్రాలు సాధించిన ఘనతలు అందరికీ తెలిసిందే. ఇటీవల వచ్చిన అఖండ సినిమా బాలయ్య ఫాన్స్ కు మంచి ఊపు తీసుకొచ్చింది.

 

ఇకపోతే ఆయన నటించిన ముద్దుల మావయ్య సినిమాకు ఓ ప్రత్యేకమైన రికార్డు ఉంది. కోడి రామకృష్ణ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా విజ‌య‌శాంతి, చెల్లి పాత్ర‌లో సీత న‌టించింది. ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర హిట్ అవ్వ‌డంతో పాటు 1989లో అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది.

 

కోలీవుడ్‌లో వ‌చ్చిన ఎన్ త‌న్గ‌చి ప‌డిచావాకి రీమేక్‌గా ముద్దుల మావయ్యను తెరకెక్కించారు. ఆ తర్వాత హిందీలో ఆజ్ కా అర్జున్‌గా, కన్నడంలో రవిమామ, బెంగాలీలో పబిత్రపాపీగా రీమేక్ చేశారు. అప్పట్లోనే పాన్ ఇండియా స్థాయిలో మూవీ దూసుకుపోయింది.

పొరుగు రాష్ట్రాల్లోనూ 100 రోజులు ఆడింది..

ఈ సినిమా ఉమ్మడి ఏపీలో 51 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది. అప్ప‌టి వ‌ర‌కు ఉన్న శ‌త‌దినోత్స‌వాల రికార్డుల‌ను పూర్తిగా బ్రేక్ చేసేసింది. అలాగే పొరుగు రాష్ట్రమైన ఒడిశాలో శ‌త‌దినోత్స‌వం జ‌రుపుకున్న తొలి తెలుగు చిత్రంగా ముద్దుల మావ‌య్య రికార్డుల‌కు ఎక్కింది. శ్రీకాకుళంకు బోర్డ‌ర్‌లో ఉన్న ఒడిశా టౌన్ ప‌ర్లాకిమిడీ జ‌య‌మ‌హాల్లో ఈ సినిమా 100 రోజులు ఆడటం గమనార్హం. క‌ర్నాక‌ట‌లోని చింతామ‌ణి సెంట‌ర్ల‌లో కూడా ఈ సినిమా 100 రోజులు ఆడ‌డం విశేషం.

 

ముద్దుల మావ‌య్య సినిమా మొదటి వారంలోనే రూ.1.16 కోట్ల కలెక్షన్లు సాధించింది. ఇది కూడా ఓ రికార్డే. 25 రోజులకి రూ.1.56 కోట్లు, టోటల్‌గా రూ.5.5 కోట్లు రూపాయలు వసూలు చేసింది. ఇప్పటి లెక్కలతో పోలిస్తే అది కనీసం రూ.200 కోట్లతో సమానమని సినీ విశ్లేషకులు చెబుతుంటారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -