Samantha-Balayya: సమంత అనారోగ్యంపై బాలయ్య అందుకే స్పందించలేదా?

Samantha-Balayya: ప్రముఖ హీరోయిన్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతున్నానని చెప్పిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది సమంత త్వరగా కోలుకోవాలంటూ స్పందించారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా సమంతకు ధైర్యం చెప్పారు. మెగా స్టార్ చిరంజీవి సమంత త్వరగా కోలుకోవాలంటూ కోరుకున్నారు. సమంతకు ధైర్యం చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా సమంత త్వరగా కోలుకోవాలని ట్వీట్ చేశాడు. అనేక మంది హీరోయిన్లు, హీరోలు కూడా ఈ అంశంపై స్పందించారు.

సమంత గురించి చాలామంది హీరోలు స్పందిస్తున్నా నందమూరి నట సింహం బాలయ్య మాత్రం స్పందించలేదు. సమంతతో పెద్దగా పరిచయం లేకపోవడం ఆమెను బాలయ్య ఎప్పుడూ కలవకపోవడంతోనే బాలయ్య ఈ విషయం గురించి స్పందించలేదని తెలుస్తోంది. దీంతో పాటు బాలయ్యతో కలిసి నటించకపోవడం కూడా కారణమని తెలుస్తోంది.

బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిని నడుపుతూ ఎందరికో జీవితాన్నిచ్చిన బాలయ్య.. సినీ ఇండస్ట్రీలో ఓ ప్రముఖ హీరోయిన్ కు అరుదైన వ్యాధి వస్తే కనీసం స్పందించకపోవడం ధర్మం కాదని పలువురు విశ్లేషిస్తున్నారు. మానవత్వంలో బాలయ్యది పెద్ద మనసని, ఈ విషయం అనేక వేదికల్లో రుజువైందని గుర్తు చేస్తున్నారు. దీంతో పాటు ఎమ్మెల్యేగా కూడా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు బాలయ్య. కానీ ఒకే రంగానికి చెందిన నటి జబ్బు గురించి స్పందించకపోవడం సమంజసం కాదంటున్నారు.

ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా ఉండాలంటే సపోర్ట్ అవసరమే కదా..

సినిమా ఇండస్ట్రీలో వ్యక్తుల మధ్య విభేదాలున్నా.. కళా రంగంగా తామంతా ఒక్కటే అని రుజువు చేసుకోవాలంటే ఇలాంటి సమయాల్లో అండగా ఉండాలి. లైఫ్ లో సమస్యలు అందరికీ వస్తాయి. కానీ ఆపత్కాలంలో ఒకరికి మరొకరు తోడుగా ఉంటే ఎలాంటి సమస్యనైనా జయించవచ్చు. కరోనా సమయంలో చిన్న కళాకారులను ఎందరో పెద్ద హీరోలు ఆదుకున్నారు. మరి పెద్ద స్టార్లకే కష్టాలు వస్తే అందరూ కలిసి కట్టుగా ఉండాల్సిన సమయంలో కనీసం స్పందించకపోవడం పద్ధతి కాదని నిపుణులు పేర్కొంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -