Balakrishna: బాలయ్య సంచలన నిర్ణయం.. టెన్షన్ లో అల్లు నిర్మాత?

Balakrishna: బాలయ్య బాబు సినిమాల ఎంపిక నిర్ణయాల్లో చాలా జాగ్రత్తగా ఉంటారు. ఇలాంటి విషయాల్లో ప్రతిసారి తన నిర్ణయంతో అభిరామానులను ఆశ్చర్యానికి గురి చేస్తారు బాలయ్య. అలాంటి ఒక సర్ప్రైజ్ నిర్ణయమే ఇప్పుడు అభిమానులను, అల్లు నిర్మాతను షాక్ కి గురి చేసిందని టాలీవుడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రస్తుతం బాలయ్య యువ డైరెక్టర్లతో వరుసగా మూవీలు ప్లాన్ చేస్తున్నారు. అయితే గోపీచంద్ మలినేనితో సినిమా చేస్తున్న బాలయ్య బాబు.. తర్వాతి సినిమా కోసం అనిల్ రావిపూడిని సెలెక్ట్ చేసుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు దర్శకులు చెప్పిన కథ విని ఒకరిని ఎంపిక చేసారని సమాచారం.. ఆ డైరెక్టర్లే.. మహా వెంకటేష్, పరుశురాం.

 

దర్శకుడు మహా వెంకటేష్.. ‘కేర్ ఆఫ్ కంచెరపాలెం’ సినిమాతో పరిచయం అయ్యారు. ఇక ఈ సినిమా మంచి డీసెంట్ హిట్ గా పేరు తెచ్చుకోవడంతో దర్శకుడు మంచి మార్కులే కొట్టేసాడు. అత్యంత సహజంగా నిజ జీవితానికి దగ్గరగా ఉన్న ఈ సినిమా సీన్లు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. కమర్షియల్ గాను సినిమా బాగానే రాణించింది. దీనితో మొదటి మూవీనే మహా వెంకటేష్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇటీవల ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేష్ మాట్లాడుతూ.. బాలకృష్ణతో సినిమా తీయాలని ఉందని చెప్పగా.. తప్పకుండ తీస్తానని బాలయ్య చెప్పడమే కాక.. స్టోరీ లైన్ కూడా విన్నారట.

 

ఇక అదే కార్యక్రమంలో డైరెక్టర్ పరశురామ్ బాలయ్య బాబు పై చేసిన వ్యాఖ్యలు అందర్నీ ఆశ్చర్యపరిచాయి. “తొందరలో బాలయ్యతో మంచి కథతో మీ ముందుకు రాబోతున్నాం” అని ప్రకటించారు. దీనితో బాలయ్య – పరుశురాం కాంబోలో సినిమా వస్తుందని అందరికీ అర్ధమైంది. గీతా ఆర్ట్స్ లో సినిమా ప్లాన్ చేస్తున్నట్టు హింట్ ఇచ్చిన వీరు.. బాలకృష్ణకు స్టోరీ లైన్ కూడా ఇప్పటికే వినిపించారట.

 

టాలీవుడ్ వర్గాల చర్చల ప్రకారం.. వెంకటేష్ మరియు పరుశురాం ఇద్దరు డైరెక్టర్స్ చెప్పిన కథల్లో.. వెంకటేష్ చెప్పిన కథకు బాలయ్య పడిపోయారని టాక్. హ్యూమన్ డ్రామా, రియలిస్టిక్ ఫెరఫార్మెన్స్ లకు ఆ డైరెక్టర్ చెప్పిన కథలో మంచి ప్రాధాన్యత ఉండటంతో దానికి బాలయ్య అట్రాక్ట్ అయిపోయారని సమాచారం. కాగా ఈ సినిమాను లెజండ్ హిట్ అందించిన వారాహి బ్యానర్ పై చేయడానికి ఫిక్స్ అయ్యిందట. ఇక పరుశురాం తో ఇప్పుడప్పుడే సినిమా ఉండదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: పార్టీ నిర్వహణ అవసరాల కోసం 10 కోట్ల రూపాయలు ప్రకటించిన పవన్.. గ్రేట్ కదా!

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి పార్టీ అవసరాల కోసం పెద్ద ఎత్తున తన సొంత డబ్బును ఖర్చు చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. సాధారణంగా ఎవరైనా...
- Advertisement -
- Advertisement -