Balayya: 14 థియేటర్లలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది!

Balayya: తెలుగు సినీ రంగంలో నందమూరి నటసింహం బాలకృష్ణ రేంజే వేరు. అద్భుతమైన కథలతో, మాస్, క్లాస్, రొమాన్స్ కలగలిపిన నటనతో ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాలు తీసాడు బాలయ్య బాబు. పొలిటికల్, ఫ్యాక్షన్, ఫ్యామిలీ, లవ్.. ఇలా కేటగిరీ ఏదైనా బాలయ్య తనదైన ముద్ర వేసేసారు. అభిమానులకు బాలయ్య అంటే చాలా ప్రత్యేకం. బాలయ్య బాబు ఇటీవల కూడా యంగ్ హీరోలకు ఎంతో పోటీనిస్తూ.. సూపర్ హిట్ మూవీస్ తీస్తుండటం బాలయ్య క్రేజ్ ని తెలియజేస్తుంది. రికార్డు స్థాయిలో కలెక్షన్లు, బ్లాక్ బస్టర్ హిట్లు బాలయ్య కెరీర్ లో లెక్కలేనన్ని ఉన్నాయి.

 

బాలయ్య సినిమా అంటే తెలుగు సినీ ప్రపంచంలో ప్రత్యేకమైన వాతావరణాన్ని సెట్ చేసేవి. ఎన్నో సినిమాలు సైలెంట్ గా వచ్చి సూపర్ డూపర్ హిట్లు గా నిలిచాయి. మరో విషయం ఏంటనే బాలయ్య ఎంచుకునే కథలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. బాలయ్య సినిమాల్లో కథలు చాలా గొప్పగా ఉంటాయని విమర్శకులు కూడా ప్రశంసిస్తారు. దీన్ని బట్టి బాలయ్య సినిమా కథలు ఎంత బలంగా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. మొదటి నుండి ఇప్పటి వరకు కూడా బాలకృష్ణ కథల విషయంలో అంతే జాగ్రత్తగా ఉంటారు.

 

14 థియేటర్లలో రిలీజ్ అయ్యి, రికార్డు కలెక్షన్లు
బాలయ్య బాబు నటించిన నరసింహ నాయుడు సినిమా 2001 సంవత్సరంలో.. హైదరాబాద్ లో కేవలం 14 థియేటర్లలో విడుదలైంది. కానీ సినిమా కథ, బాలయ్య బాబు నటనతో.. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను సాధించి రికార్డులు క్రియేట్ చేసింది. అప్పట్లో 14 థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయ్యి ఆ స్థాయిలో కలెక్షన్లు రాబట్టడం అంటే మాములు విషయం కాదు. బాలయ్య తన సినీ కెరీర్ లో ఎన్నో రికార్డులను క్రియేట్ చేసుకున్నారు.

 

ఇలాంటి హిట్స్ బాలయ్య కెరీర్ లో కోకొల్లలు. ఒక సినిమాతో రికార్డ్స్ క్రియేట్ చేసి.. తర్వాతి సినిమాతో తానే తన రికార్డులు తిరగరాసేవారు బాలకృష్ణ. అది తెలుగు ఇండస్ట్రీలో బాలయ్య క్రేజ్. పవర్ ఫుల్ నటన, ఎలాంటి క్యారెక్టర్ అయినా ఒదిగిపోయి నటించడం బాలయ్య బాబు ను ఓ రేంజ్ లో నిలబెట్టాయి. నరసింహ నాయుడు లాంటి హిట్లు ఎన్నో బాలయ్య సొంతం. ఇటీవల బాలయ్య చేసిన అఖండ వంటి సినిమా ఎంత హిట్టయ్యిందో మనందరికీ తెలిసిందే.

Related Articles

ట్రేండింగ్

Botsa Satyanarayana: కూటమికి ఓటేస్తే స్టీల్‌ప్లాంట్‌ని రక్షించలేమట.. అధికారంలో ఉండి ఏం చేశారు బొత్స గారు?

Botsa Satyanarayana: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైసిపి నేతలందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాలను మొదలు పెడుతున్నారు. అయితే చాలా చోట్ల వీరికి పూర్తి స్థాయిలో వ్యతిరేకత ఏర్పడుతుందని తెలుస్తుంది. ఈ...
- Advertisement -
- Advertisement -