Balayya: బాలయ్య సీఎం కావాలనుకుంటున్నారా.. ఏం చెప్పారంటే?

Balayya: తెలుగు సినిమా రంగంలో తిరుగులేని ఫ్యాన్స్ ను సొంతం చేసుకున్న టాప్ హీరోల జాబితాలో నందమూరి బాలయ్య కూడా ఒకడిగా నిలుస్తాడు. నందమూరి నట వారసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన నందమూరి బాలయ్య.. ఇప్పుడు తెలుగులో టాప్ హీరోగా కొనసాగుతున్నాడు. ఓ వైపు వెండితెర మీద సినిమాలు చేస్తూనే బుల్లితెర మీద టాక్ షో చేస్తూ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.

 

అదే సమయంలో బసవతారకం ఆస్పత్రికి చైర్మన్ గా వ్యవహరిస్తూ.. పేదలకు వైద్య సేవలు అందించడంలో పాటుపడుతున్నాడు. రాజకీయాల్లో కూడా నందమూరి బాలకృష్ణ చురుకుగా ఉంటున్నాడు. ఏపీలోని అనంతపురం జిల్లా హిందూపురం నుండి తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన బాలయ్య అక్కడి నుండి గెలుపొందగా.. ఎమ్మెల్యేగా కూడా తన సేవలను అందిస్తున్నాడు.

 

ఏపీలో రాజకీయంగా కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. ఏపీకి సీఎం అవుతారా? అనే ప్రశ్న బాలయ్యకు ఎదురవుతోంది. తాజాగా ఓ టీవీ ఛానల్ రిపోర్ట్ కూడా బాలయ్య సీఎం కావాలనుకుంటున్నారా? అని ప్రశ్నించాడు. దీంతో బాలయ్య తన మనసులోని మాటను బయటపెట్టాడు. సీఎం పదవి గురించి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.

 

తాను ఎప్పుడూ సీఎం కావాలని ఆశించలేదని నందమూరి బాలయ్య స్పష్టం చేశాడు. తాను సీఎం కుర్చీని కోరుకోవడం లేదన్న బాలయ్య.. కేవలం ప్రజా సేవ మాత్రమే చేయాలని అనుకుంటున్నట్లు వివరించాడు. అలా ప్రజాసేవలో వచ్చే ప్రతిఫలాలను అందుకోవాలని అనుకుంటున్నట్లు తెలిపాడు. దీంతో సీఎం రేసులో తాను ఉండబోనని బాలయ్య స్పష్టతనిచ్చాడు.

Related Articles

ట్రేండింగ్

Bandla Ganesh-Roja: రోజా పులుసు పాప.. బండ్ల గణేష్ లేకి వ్యాఖ్యలు ఎంతవరకు రైట్ అంటూ?

Bandla Ganesh-Roja: సినీ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పట్ల అదే విధంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం...
- Advertisement -
- Advertisement -