Balayya: బాలయ్య బర్త్ డే కానుకలివే.. ఆ అప్ డేట్స్ వస్తాయట!

Balayya: టాలీవుడ్ నందమూరి నటసింహం హీరో బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బాలకృష్ణ బ్యాక్ టు బ్యాక్ సినిమాలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా అవకాశాలను అందుకుంటున్నారు బాలయ్య బాబు. ఇటీవల కాలంలో బాలయ్య బాబు నటించిన సినిమాలు అన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలుస్తున్నాయి. ఇకపోతే వచ్చే నెల అనగా జూన్ 10న బాలయ్య బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వబోతున్నారు మూవీ మేకర్స్.

అందులో మొదటిది అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా టైటిల్ ను రివీల్ చేయబోతున్నారు. రెండవది బాలకృష్ణ నటించిన నరసింహనాయుడు సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా 2001 లో విడుదల అయ్యి సూపర్ హిట్ సాధించిన విషయం తెలిసిందే. ఇక మూడవది భైరవద్వీపం. 1994లో విడుదలైన ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు మూవీ మేకర్స్. అప్పట్లో అద్భుత విజయం సాధించిన ఈ సినిమా ఎవర్ గ్రీన్ అని చెప్పవచ్చు. ఈసారి బాలయ్య బాబు పుట్టినరోజుకు అభిమానులకు త్రిబుల్ ధమాకా అని చెప్పవచ్చు.

 

ఇకపోతే బాలయ్య బాబు సినిమాల విషయానికి వస్తే ఇటీవలే ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ కానుకగా వీర సింహారెడ్డి సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలయ్య బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలను నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతోంది అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాను దసరా పండుగ కానుకగా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్.

 

Related Articles

ట్రేండింగ్

Ambati Rambabu: చెత్తకుప్పల్లోకి చేరిన వైసీపీ టీ కప్పులు.. ప్రచారం వికటిస్తోందిగా జగన్?

Ambati Rambabu: వైసిపి అధినేత జగన్మోహన్ రెడ్డికి అలాగే వైసిపి నాయకులకు ప్రచారాల పిచ్చి భారీగా ఉందనే సంగతి మనకు తెలిసిందే. అభివృద్ధి లేకపోయినా ప్రచారం మాత్రం పీక్స్ లో ఉంటుంది. చేసింది...
- Advertisement -
- Advertisement -