Balayya: ఆర్ఆర్ఆర్ ఆస్కార్ పై బాలయ్య కామెంట్స్ వింటే షాకవ్వాల్సిందే!

Balayya: ఆర్ఆర్ఆర్ చరిత్ర తిరగరాసింది. తెలుగోడి హృదయం ఉప్పొంగేలా చేసింది. నాటు నాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకుంది. ప్రపంచ పటంపై జక్కన్న మెరిసారు. జూనియర్ ఎన్టీఆర్ -రాం చరణ్ అభిమానుల సంతోషానికి హద్దులు లేవు. ఆస్కార్ వేదిక పైన నాటు నాటు స్టెప్పులతో దుమ్ము లేచింది. వేదిక పైన బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నాటు నాటు పాటకు ఆస్కార్ ప్రకటన రాగానే ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో డాల్బీ థియేటర్‌ దద్దరిల్లిపోయింది. కీరవాణి, చంద్రబోస్ అవార్డును అందుకున్నారు. నమస్తే అంటూ ఆస్కార్ వేదికపై చంద్రబోస్ ప్రత్యేకంగా నిలిచారు.

ఎన్టీఆర్, రామ్ చరణ్ చరిత్ర పటంలో నిలిచారు. జక్కన్న దర్శక ప్రతిభకు ప్రపంచం మురిసిసోయింది. ఆస్కార్ వేదికపై ఆర్ఆర్ఆర్ గెలుపు బావుగా ఎగరవేసింది, బెస్ట్ ఒర్జినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ ను ముద్దాడింది. అస్కార్ అందుకున్న తొలి భారతీయ పాటగా కొత్తి రికార్డును క్రియేట్ చేసింది. రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆస్కార్ వేదికపై నాటు నాటు పాట లైవ్ పెర్ఫామెన్స్‏తో అదరగొట్టారు. హాలీవుడ్ డ్యాన్సర్స్ వెస్టర్స్ డాన్స్ తో మెప్పించారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్‏లో లాల్చీ, పంచకట్టులో స్పెషల్ అట్రాక్షన్ గా మారారు. అవార్డు ప్రకటించగానే ఆర్ఆర్ఆర్ టీం సంతోషానికి ఆకాశమే హద్దుగా కనిపించింది. రాజమైళి, మూవీ యూనిట్ సంబరాల్లో మునిగిపోయింది. ఇటు జూనియర్ ఎన్టీఆర్..రాం చరణ్ అభిమానులు పండగు చేసుకుంటున్నారు.

 

ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డుని గెలుపొందిన ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్ర బృందానికి నా హృదయపూర్వక అభినందనలు. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలోని నాటు నాటు పాట బెస్ట్‌ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరిలో ఉత్తమ పాటగా ఆస్కార్ అవార్డును సొంతం చేసుకోవడం భారతీయ సినీ చరిత్రలో అపూర్వ ఘట్టం. తెలుగు జాతితోపాటు దేశం గర్వించదగిన విజయమిది. స్వరకర్త కీరవాణి, గీత రచయిత చంద్రబోస్ కి, ఆర్ఆర్ఆర్ చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు నటసింహం బాలకృష్ణ.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -