Balayya: నిప్పులు, మేకులతో బాలయ్య ఫైట్.. ఒళ్లు గగుర్పొడిచేలా?

Balayya: తెలుగు సినిమా ఇండస్ట్రీలో డైలాగ్ చెప్పాలన్నా, ఊరమాస్ ఫైట్లతో పూనకాలు తెప్పించాలన్న ఒక్క బాలయ్యకే సొంతం. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎన్నో రికార్డులను పరిచయం చేసిన నందమూరి బాలయ్య.. ఇప్పటికీ తన ప్రస్థానాన్ని ఎంతో విజయవంతంగా కొనసాగిస్తున్నాడు. కేవలం హీరోగా సినిమాలు మాత్రమే చేయడం కాకుండా, ఓటీటీలో టాక్ షో ప్రారంభించి తనకు తిరుగులేదని నిరూపించాడు.

 

బోయపాటి శీనుతో బాలయ్య చేసిన ‘అఖండ’ రికార్డులు తిరగరాయగా.. కరోనా తర్వాత జనాలు తిరిగి థియేటర్లకు వచ్చేలా ఈ సినిమా చేసింది. ప్రస్తుతం బాలయ్య ‘వీరసింహారెడ్డి’ పేరుతో ఫుల్ మాస్ సినిమా చేస్తుండగా.. ఈ సినిమాకు బాలయ్య అభిమాని గోపిచంద్ మలినేని డైరెక్షన్ చేస్తుండటం కొనమెరుపు. తన అభిమాన హీరోని వీరలెవల్ లో మాస్ లుక్ లో చూపిస్తున్న గోపిచంద్.. బాలయ్య ఓ భారీ యాక్షన్ సీన్ ని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.

 

ఈ ఏడాది సంక్రాంతి బరిలో రానున్న బాలయ్య ‘వీరసింహారెడ్డి’ సినిమాలో డైరెక్టర్ గోపిచంద్ ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీన్ ని తెరకెక్కించినట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. ఈ సీన్ చూసిన ప్రేక్షకులు, అభిమానులు పూనకాలు వచ్చి ఊగిపోతారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఫైట్ సీన్ ఓ గుడిలో ఉండబోతున్నట్లు తెలుస్తుండగా.. ఇందులో నిప్పులను తొక్కుకుంటూ బాలయ్య ఫైట్ చేస్తాడని సమాచారం. నిప్పులు, మేకులతో బాలయ్య చేసే ఫైట్ సీన్ ఇప్పటి వరకు స్క్రీన్ మీద ఎవరూ చేయలేదని టాక్.

 

డైరెక్టర్ ఏం చెబితే అది తూచా తప్పకుండా చేసే బాలయ్య, తన అభిమాన హీరోని వీర లెవల్ లో చూపించాలనుకునే అభిమానే డైరెక్టర్ గా మారిన వేళ.. ఈ సీన్ థియేటర్లను ఊపేస్తుందనే టాక్ నడుస్తోంది. మాస్ కి కేరాఫ్ గా ఉండే బాలయ్య ఈ ఫైట్ సీన్ ని ఇరగదీశాడని.. ప్రేక్షకులు సీట్లు చించే అద్భుతమైన ఫైట్ సీన్ ఇదని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి ఫైట్ సీన్ నభూతో నభవిష్యత్ అన్నట్లు ఉంటుందని నందమూరి అభిమానులు ఉత్సాహంగా చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -