Balayya: బాలయ్య సినిమాకే అన్యాయం చేస్తున్నారట!

Balayya: నైజాం థియేటర్లలో రగడ మొదలైనట్లు కనిపిస్తోంది. తాజాగా మైత్రీ మూవీస్.. నైజాంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫీస్‌ను ప్రారంభించారు. దీంతో నైజాంలో థియేటర్లను బ్లాక్ చేసే పనిలో పడినట్లు తెలుస్తోంది. అయితే ఓ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ బెదిరింపులకు పాల్పడుతున్నట్లు సమాచారం. థియేటర్ల యజమానులు మైత్రీ మూవీ మేకర్స్ సినిమాలకు థియేటర్లు ఇస్తే.. తన గడప తొక్కొద్దని హెచ్చరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.

 

అయితే ఈ విషయంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ కూడా సీరియస్‌గానే ఉంటున్నారు. గతంలో డబ్బింగ్ సినిమాకు థియేటర్లు ఎలా ఇచ్చారని, ఇప్పుడు సంక్రాంతి సీజన్ సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉన్న సినిమాలకు ఎందుకు ఛాన్సులు ఇవ్వట్లేదని నిలదీశారు. కాగా, దిల్‌రాజు కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా తన రెండు డబ్బింగ్ సినిమాలను థియేటర్లలో భారీగా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలో హీరో అజిత్ డబ్బింగ్ సినిమాను ఆయన థియేటర్లలో రిలీజ్ చేయబోతున్నారు.

మరోవైపు నందమూరి నటసింహం బాలయ్య బాబు నటిస్తోన్న ‘వీరసింహా రెడ్డి’, మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న ‘వాల్తేర్ వీరయ్య’ కూడా సంక్రాంతి కానుకగా విడుదల కానున్నాయి. అయితే ఈ సినిమాలు మైత్రీ నిర్మాణంలోనే తెరకెక్కుతున్నాయి. నైజాంలో మైత్రీ సంస్థ స్వంతంగా విడుదల చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం మైత్రీ సంస్థ ఏకంగా డిస్ట్రిబ్యూషన్ ఆఫీసును ప్రారంభించినట్లు సమాచారం. దీంతో నైజాంలో థియేటర్ల యజమానుల మధ్య రగడ నడుస్తోంది.

 

అయితే ఏషియన్ సంస్థ చేతిలో చాలా వరకు థియేటర్లు ఉన్నాయి. ఒక వేళ అఖిల్ నటించిన ‘ఏజెంట్’ సినిమా సంక్రాంతికి విడుదల కాకపోతే మైత్రీకి థియేటర్లు ఇచ్చే అవకాశం ఉందని ఏషియన్ సంస్థ యాజమాన్యం తెలిపింది. అలాగే విశాఖపట్నంలోనూ థియేటర్లు ఎక్కువగా ఉన్నాయి. ఉన్న మంచి థియేటర్లలో ‘వారసుడు’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. కానీ ‘వీరసింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య’కు థియేటర్లు దొరకడం లేదు. దీంతో అటు బాలయ్య ఫ్యాన్స్, ఇటు మెగాస్టార్ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అతి తక్కువ థియేటర్లలో మాత్రమే బాలయ్య బాబు సినిమాలు విడుదల కానున్నట్లు సమాచారం. కేవలం రెండు డబ్బింగ్ సినిమాల విడుదల వల్ల స్టార్ హీరోల సినిమాలకు ఇబ్బందిగా మారింది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -