Balayya Habits: బాలయ్య షాకింగ్ అలవాట్ల గురించి మీకు తెలుసా?

Balayya Habits: నందమూరి నటసింహం బాలకృష్ణ-దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘వీరసింహారెడ్డి’. ఫ్యాక్షన్, యాక్షన్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మొదటి పాట రిలీజ్ అయింది. హీరో పాత్రను తెలియజేసేలా మాస్ సాంగ్‌ను చిత్రీకరించారు. ప్రముఖ సింగర్ తమన్ స్వరాలు అందించారు. ‘జై బాలయ్య.. జై జై బాలయ్య’ అంటూ సాగే ఈ సాంగ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. కాగా, వీరసింహారెడ్డి సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదల కానుంది.

 

తాజాగా బాలయ్య ఓ ప్రముఖ ఛానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో బాలయ్య షాకింగ్ విషయాలు వెల్లడించాడు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ..‘పొద్దున నిద్ర లేవగానే చుట్ట కాల్చే అలవాటు ఉంది. మంచంపై నుంచి కాలు కింద పెట్టనప్పుడే చుట్ట కాలుస్తాను. అప్పట్లో నాన్న నందమూరి తారకరామారావు గారు కూడా చుట్ట కాల్చేవారు. అలా నాకు కూడా అలవాటు అయింది. చుట్ట కాలిస్తే రాజసంలా అనిపిస్తది. అందుకే చుట్ట కాలుస్తాను. అలాగే సాయంత్రం ఛాయ్ తాగడం అలవాటు ఉంది. ఈ రెండు అలవాట్లు తప్పా.. మరే అలవాట్లు లేవు.’ అని పేర్కొన్నారు.

 

 

కాగా, బాలయ్య తన కొడుకు మోక్షజ్ఞ తేజ సినిమా ఎంట్రీ గురించి కూడా మాట్లాడారు. మంచి సినిమా కోసం ట్రై చేస్తున్నామని, త్వరలో మోక్షజ్ఞను సినిమాలో ఎంట్రీ ఇవ్వనున్నట్ల పేర్కొన్నారు. అన్ని బాగుంటే ఆదిత్య 369 సినిమా సీక్వెల్‌లో నటించే అవకాశం ఉందని తెలిపారు. తెలుగు ప్రజలకు, ఆడబిడ్డలకు నచ్చేలా.. నలుగురు ఆదరించేలా మోక్షజ్ఞ తేజను హీరోగా ఎంట్రీ ఇవ్వాలని అనుకుంటున్నామని బాలయ్య పేర్కొన్నారు. ఆదిత్య 999 మ్యాక్స్ సినిమాలో కచ్చితంగా మోక్షజ్ఞ తేజ ఎంట్రీ ఉంటుందని, అందులో మేమిద్దరం కలిసి నటించబోతున్నామని బాలయ్య పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -