Alekhya Reddy: మేం కుటుంబం అని పిలిచే వ్యక్తి బాలయ్య మాత్రమే.. అలేఖ్య ఎమోషనల్!

Alekhya Reddy: నందమూరి తారకరత్న మరణించడంతో ఆయన సతీమణి అలేఖ్య రెడ్డి దుఃఖసాగరంలో మునిగిపోయారు.ఇలా తరుచు సోషల్ మీడియా వేదికగా తన భర్తతో కలిసి ఉన్నటువంటి అందమైన జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ ఈమె ఎంతో ఎమోషనల్ అవుతున్నారు. ఇలా తారకరత్న మరణించడంతో అలేఖ్య రెడ్డి కుటుంబానికి బాలయ్య అండగా ఉంటానని హామీ ఇచ్చారు.ఈ క్రమంలోనే తన కుటుంబానికి బాలయ్య కొండంత అండగా నిలిచారంటూ గత కొద్ది రోజుల క్రితం అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా వేదికగా తెలియజేసిన విషయం తెలిసిందే.

 

ఇకపోతే తాజాగా బాలకృష్ణ తారకరత్న విషయంలో ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నారు. తారకరత్న గుండెపోటుకు గురై మరణించడంతో మరెవరికి ఇలాంటి పరిస్థితి రాకూడదనే నేపథ్యంలో ఈయన హైదరాబాద్లోని బసవతారకం హాస్పిటల్ లోనూ అలాగే హిందూపురంలో తాను నిర్మిస్తున్నటువంటి హాస్పిటల్లో కూడా ఇలాంటి గుండె సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఉచితంగా వైద్యం అందించనున్నట్లు వెల్లడించారు. ఇకపోతే హిందూపురంలో నిర్మించే హాస్పిటల్ ఓ బ్లాక్ కు తారకరత్న పేరును పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఇక ఈ విషయం తెలుసుకున్నటువంటి అలేఖ్య రెడ్డి బాలయ్య ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇంతకన్నా నేను మీకు ఏం చెప్పగలను..నేను మీకు నా కృతజ్ఞతలు ఎలా తెలియజేయగలరు నేను ఎలా చెప్పినా మీరు చేసే మంచి పనుల ముందు అది తక్కువే. మీరు బంగారు లాంటి మనసున్న వ్యక్తి ఈ పేరుకు మీరు మాత్రమే అర్హులు. మీలా మరెవరు చేయలేరు.మీలో ఒక తండ్రిని ఒక స్నేహితుని చూసుకుంటున్నాను మీరు ఇప్పుడు నాకు ఒక దేవుడిలా కనిపిస్తున్నారు.

 

మీరు చూపిస్తున్న ఈ ప్రేమకు నాకు మాటలు రావడం లేదు… మీరు చేస్తున్న ఈ మంచి పనికి నా గుండె లోతుల నుంచి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీరు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో అంతకంటే ఎక్కువగా మేము మిమ్మల్ని ప్రేమిస్తున్నాము.జై బాలయ్య అంటూ ఈమె సోషల్ మీడియా వేదికగా బాలకృష్ణ చేసినటువంటి మంచి పని గురించి చెబుతూ ఎమోషనల్ పోస్ట్ చేశారు. ఇలా ఈ పోస్ట్ వైరల్ గా మారడంతో బాలయ్య అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ నిజంగా ఈయన దేవుడు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -