Balakrishna: తనతో నటించిన హీరోయిన్లలో బాలయ్యకు ఇష్టమైన హీరోయిన్ ఎవరంటే?

Balakrishna: ఇండస్ట్రీలో మాస్ డైలాగ్స్ తో హిట్ కొట్టాలన్న.. కోపంలో ఎవరైనా తిట్టాలన్న బాలయ్య బాబే. మంచికి మంచి.. పంచ్‌కి పంచ్.. ఇదే బాలయ్య నైజం. సినిమాలతోపాటు హోస్ట్‌ గా తన అభిమానులను ఎల్లప్పుడూ అలరిస్తుంటారు. ఇప్పటివరకు బాలయ్య ఎన్నో సినిమాల్లో నటించారు. అలాగే చాలా మంది హీరోయిన్లతో కూడా కలిసి పని చేశారు. కానీ బాలయ్యకు కేవలం ఒకే ఒక్క హీరోయిన్ ఎంటే మాత్రం ఎంతో ఇష్టమట. ఇటీవల ఓ షోలో తన ఫేవరేట్ హీరోయిన్ గురించి బాలయ్య చెప్పుకొచ్చారు.

బాలకృష్ణ ఎక్కువగా హీరోయిన్ సిమ్రాన్‌తో సినిమాలు చేశారు. ఒకప్పుడు టాలీవుడ్‌లో బాలకృష్ణ-సిమ్రాన్ సూపర్ హిట్ జోడి. వీరిద్దరు కలిసి నటించిన సినిమాలు టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచాయి. ఇందులో రెండు సినిమాలు మాత్రం ఇండస్ట్రీయల్ హిట్ అందుకున్నాయి. బీ.గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సమరసింహా రెడ్డి’ సినిమాతో సిమ్రాన్ మొదటిసారిగా బాలకృష్ణతో సినిమా చేశారు. ఈ సినిమా అప్పట్లో తెలుగు ఇండస్ట్రీలోని అన్ని రికార్డులను తిరగరాసింది.

సమరసింహా రెడ్డి సినిమా తర్వాత బాలకృష్ణ-సిమ్రాన్ జోడిగా నటించిన సినిమా ‘గొప్పింటి అల్లుడు’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేదు. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన మూడో చిత్రం ‘నరసింహా నాయుడు’ మాత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఈ సినిమా కూడా ఇండస్ట్రీయల్ హిట్ అందుకుంది. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన నాలుగో సినిమా ‘సీమ సింహం’. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్లాప్ అయింది.

ఆ తర్వాత విడుదైన ‘సీమ సింహం, ఒక్క మగాడు’ సినిమాలు కూడా డిజాస్టర్‌గా నిలిచాయి. అలా బాలయ్యతో కలిసి సిమ్రాన్ ఐదు సినిమాల్లో నటించారు. అయితే బాలయ్యకు నటి సిమ్రాన్ అంటేనే ఎక్కువ ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం బాలయ్య డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్వకత్వంలో ‘వీరసింహారెడ్డి’ సినిమాల్లో నటిస్తున్నారు. సంక్రాంతి బరిలో సందడి చేసేందుకు సెట్స్ పై శరవేగంగా ముస్తాబవుతోంది.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -