Balayya Steps: మా బావ మనోభావాలు సాంగ్ గురించి ఫ్యాన్స్ కామెంట్లు విన్నారా?

Balayya Steps: టాలీవుడ్ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కల్చర్ ఎక్కువవుతోంది. ఈ మధ్యన భారీ బడ్జెట్ సినిమాల్లో కూడా స్పెషల్ సాంగ్స్ ఉండేలా చూసుకుంటున్నారు. సినిమా మొత్తం ఒక ఎత్తయితే అందులో పెట్టే స్పెషల్ సాంగ్ మరో ఎత్తు అవుతోంది. స్పెషల్ సాంగ్స్ వల్లే కొన్ని సినిమాల కలెక్షన్లు రాబడుతున్నాయంటే మీరే అర్థం చేసుకోవచ్చు. తాజాగా వీరసింహారెడ్డి సినిమా నుంచి మా బావ మనోభావాలు అనే పాటకు సంబంధించి లిరికల్ వీడియో రిలీజ్ అయ్యింది. ఈ పాటకు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో పాటు సినిమా మీద అంచనాలు పెంచింది. ఈ సాంగ్ లో బాలయ్యకు జోడీగా హనీ రోజ్, చంద్రికా రవిలు కాలు కదిపారు. బాలయ్య స్టెప్పులు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు.

వీరసింహారెడ్డి సినిమాకు బాలయ్య డ్యాన్స్ లు హైలెట్ అవ్వనున్నాయి. ప్రోమోతో ప్రేక్షకులకు పిచ్చెక్కించిన బాలకృష్ణ లిరికల్ వీడియోతో ఆ అంచనాలను ఇంకాస్త ఎక్కువగా పెంచారని చెప్పాలి. ఈ సాంగ్ లో బాలయ్య ఎనర్జీకి అభిమానులు ఫిదా అవుతున్నారు.

బాలయ్య స్టెప్పులు అదుర్స్ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. స్పెషల్ సాంగ్స్ లో ఈ సాంగ్ మరింత స్పెషల్ అని నెటిజన్లు సందడి చేస్తున్నారు. 225 సెకన్ల నిడివితో ఉన్న ఈ పాట ప్రేక్షకులను బాగా అట్రాక్ట్ చేసిందని చెప్పొచ్చు. థమన్ మ్యూజిక్ బాగుందని కొరియోగ్రఫీ ఈ సాంగ్ కు హైలెట్ గా నిలవనుందని ఈ ప్రోమోను చూస్తేనే అర్థం అయిపోతోంది.

బాలయ్య ఖతర్నాక్ స్టెప్పులతో ఉండే ఈ సాంగ్ కు థియేటర్స్ లో గోల మామూలుగా ఉండదని అభిమానులు కేకలు వేస్తున్నారు. మాస్ సాంగ్ కు బాలయ్య మాస్ స్టెప్స్ యాడ్ కావడంతో బాలయ్య అభిమానులు కేరింతలు కొడుతున్నారు. అఖండను మించి ఈ సినిమా ఉండబోతుందని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ సాంగ్ చూసిన ఫ్యాన్స్ బాలయ్యకు ఏజ్ అనేది జస్ట్ నంబర్ అని కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

Janasena: ఏపీలోని 21 అసెంబ్లీ స్థానాలలో జనసేన పరిస్థితి ఇదీ.. అన్ని స్థానాల్లో గెలిచే ఛాన్స్ ఉందా?

Janasena: మే 13వ తేదీ జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా జనసేన పార్టీ 21 స్థానాలలో పోటీ చేస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఇలా జనసేన పోటీ చేస్తున్నటువంటి ఈ స్థానాల విషయంలో...
- Advertisement -
- Advertisement -