Balayya: శృతి హాసన్ బాలయ్య మధ్య అలాంటి సీన్లు.. షాకవుతున్న ఫ్యాన్స్!

Balayya: నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన తాజా సినిమా వీరసింహారెడ్డి. దాదాపు సినిమా షూటింగ్‌ కూడా పూర్తి కావచ్చిందని సమాచారం. యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో వస్తున్న ఈ మూవీలో కమల్‌ హాసన్‌ తనయ శృతి హాసన్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలయ్య 107వ సినిమాగా ఈ మూవీ వస్తోంది. రియ‌లిస్టిక్ ఇన్సిడెంట్స్ ఆధారంగా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాకు గోపీచంద్‌ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

 

ఇటీవలే కర్నూలు కొండారెడ్డి బురుజు కేంద్రంగా సినిమా టైటిల్‌ను ప్రకటించింది చిత్ర బృందం. బాలయ్య యాక్షన్‌ సన్ని వేశాల్లో అద్భుతంగా నటించారని టాక్‌ వస్తోంది. ఈ నేపథ్యంలోనే సినిమాపై రోజుకో వార్త బయటకొస్తోంది. సంక్రాంతి బరిలో నిలిచిన వీరసింహారెడ్డి గురించిన వార్తలు తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో కొన్ని లీకులు కూడా వచ్చాయి. సినిమాలో సుమారు 11 యాక్షన్‌ సీన్స్‌ ఉన్నాయంటూ లీక్‌ అయ్యింది.

 

మరోవైపు తాజాగా మరో వార్త హల్‌ చల్‌ చేస్తోంది. వీరసింహారెడ్డిలో బాలయ్య శృతి హాసన్ మధ్య రొమాంటిక్‌ సీన్లు కూడా ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. లేటు వయసులో బాలయ్య ఘాటు సరసాలు ఆడినట్లు తెలుస్తోంది. రొమాన్స్‌లో బాలయ్య ఇరగదీశాడని చెబుతున్నారు. ఇది కాస్త మోతాదు మించి హీరోయిన్‌తో లిప్‌ లాక్‌లు కూడా ఉన్నాయని ప్రచారం జరుగుతోంది.

 

బాలయ్యతో శృతి రొమాన్స్‌?
బాలయ్య మూవీలో హీరోయిన్‌తో కాంబినేషన్‌ సీన్లు రక్తి కట్టించాయని టాక్‌ నడుస్తోంది. ఇటీవలే ఎయిర్‌ పోర్టులో ప్రియుడిని బహిరంగంగా ముద్దులతో ముంచెత్తిన శృతి హాసన్‌.. వార్తల్లో నిలిచింది. హాట్‌ టాపిక్‌ అయ్యింది. ఎక్కడ చూసినా శృతిహాసన్‌ ముద్దుల గురించే మాట్లాడుకున్నారు. తాజాగా బాలయ్య సినిమాలోనూ లిప్‌లాక్‌లు ఉన్నాయనే సరికి అందరిలో ఆసక్తి పెరిగుతోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -