Balayya: బాలయ్య అంత గొప్ప వ్యక్తి అంటున్న తమ్మారెడ్డి!

Balayya: టాలీవుడ్ లో తిరుగులేని మాస్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న హీరో నందమూరి బాలయ్య. నందమూరి నటవారసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి తనదైన స్టైల్ తో సినిమాలు చేసి గుర్తింపు సాధించాడు. డైలాగ్ డెలివరీలో తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరోకు లేనంత చరిష్మా బాలయ్యకు ఉంది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. విదేశాల్లో కూడా బాలయ్యకు విపరీతమైన ఫాలోయింగ్ ఉంటుంది.

సినిమాలతో పాటు సేవ చేస్తూ, అప్పుడప్పుడు ఫ్యాన్స్ మీద కోపగించుకుంటూ బాలయ్య వార్తల్లో నిలుస్తుండటం అందరికీ తెలిసిందే. అయితే నిజానికి బాలయ్య మనస్తత్వం ఎంతో మంచిదని, కోపంగా ఉన్నప్పుడు ఎలా ఉంటారో తెలియదు కానీ శాంతంగా ఉన్నప్పుడు మాత్రం ఎంతో ప్రేమగా ఉంటారని ఇండస్ట్రీలో టాక్.

 

బాలయ్య గురించి తెలిసిన వాళ్లెవరైనా ఆయన మనస్తత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేదరు. తాజాగా బాలయ్య గురించి ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భజద్వార ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గతంలో తామిద్దరం కలిసి గోవాలో జరిగిన ఓ ఘటన గురించి ఆయన ఓ యూట్యూబ్ ఛానల్ కు వివరించాడు.

అప్పట్లో జరిగిన ఘటన గురించి భరద్వాజ్ మాటల్లో..

‘గోవాలో 2006 లో జరిగిన ఫిలిం ఫెస్టివల్ కి నన్ను పిలిచారు. నేను బాలకృష్ణ గారికి చెప్పాను. అలా ఇద్దరం అక్కడికి వెళ్లాం కానీ వాళ్ళ రిసీవింగ్ అస్సలు బాలేదు. ఒక ఇన్నోవా పంపించేసి ఊరుకున్నారు. ఎవరూ రాలేదు. నేను బాలయ్యతో వెనక్కి వెళ్ళిపోదాం ..ఇక్కడ మనకు రెస్పెక్ట్ లేకుండా పోయింది అనేసరికి వాళ్ళు మనల్ని గౌరవించేది ఏమిటి మన గౌరవం మనకుండాలి కానీ ..వెళ్దాం పదా అని తీసుకెళ్లారు. అలా వెళ్తుండగా మధ్యలో కార్ ఆపి రోడ్ పక్కన మినరల్ వాటర్ బాటిల్స్ ఒక డజన్ కొని ఆ ట్రేని ఆయనే స్వయంగా తీసుకొచ్చి కారులో పెట్టారు..ఈ రోజుల్లో ఏ హీరో ఐనా ఒక్క బాటిల్ పట్టుకోవాలంటే ఒక అసిస్టెంట్ ఉండాల్సిందే. కానీ ఆయన మనస్తత్వం వేరు..చిన్నపిల్లాడిలా అందరితో కలిసిపోతారు. ఆయన చాలా సింపుల్. నేను ఎన్నో అడగకూడని ప్రశ్నలు కూడా అడిగాను కానీ ఆయన ఎప్పుడూ అంత ఓవర్ రియాక్ట్ అవలేదు’

– తమ్మారెడ్డి భజద్వాజ

Related Articles

- Advertisement -

Trending News

- Advertisement -

Latest Posts