Balayya: బాలయ్య నిజస్వరూపం బయటపెట్టిన నయన్.. ఏమన్నారంటే?

Balayya: వెంకటేష్ లక్ష్మీ మూవీ తో 2006 నయనతార హీరోయిన్గా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. అంతకుముందు ఆమె తమిళ్ మరియు మలయాళ చిత్రాల్లో నటించినప్పటికీ లక్ష్మీ మూవీతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. తన నటనతో ఇప్పుడు లేడీస్ సూపర్ స్టార్ గా ఎదిగిన నయనతార గురించి ప్రత్యేకించి ఎటువంటి ఇంట్రడక్షన్ అవసరం లేదు.

నయనతార ఎక్కువగా లైన్లైట్ కి దూరంగా ఉండడానికి ప్రిఫరెన్స్ ఇస్తుంది. సినిమా ప్రమోషన్స్ కానీ ఎటువంటి ఇంటర్వ్యూస్ కానీ ఎక్కువగా రావడానికి నయనతార ఇష్టపడరు. కానీ ప్రస్తుతం ఆమె నటించిన హారర్ పిక్చర్ కనెక్ట్ విడుదలకు ముందు చేసే ప్రమోషన్స్ లో భాగంగా నయనతార ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుమ ఆమెను ఇంటర్వ్యూ చేస్తూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అడిగింది. ఈ నేపథ్యంలో నయనతార చాలా రోజుల తర్వాత పలు ఆసక్తికర విషయాల గురించి ఓపెన్ గా మాట్లాడింది.

నందమూరి బాలకృష్ణ తో మూడు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నయనతార అతనితో కలిసి పని చేసినప్పుడు తనకు ఎదురైన ఎక్స్పీరియన్సెస్ గురించి చెప్పుకొచ్చింది. అందరూ బాలకృష్ణ సార్ ని చూసి భయపడతారు కానీ ఆయన చాలా ఈజీ గోయింగ్ మనిషి. చూడడానికి గంభీరంగా ఉంటారు కానీ ఆయన చాలా ఆకతాయి పనులు కూడా చేస్తారు. సాధారణంగా ఆయన అంటే చాలామంది భయపడతారు.. కానీ ఆయన అంటే పూర్తిగా తెలిసిన వాళ్లు మాత్రం ఆయనతో పని చేయడం చాలా పెద్ద సంతోషమైన విషయంగా భావిస్తారు అని నయనతార ఇంటర్వ్యూలో చెప్పింది.

 

ఒకసారి సెట్లో ఒక ఫోకస్ పుల్లర్ వణుకుతున్నాడట. అతను టెన్షన్ కి కారణం అర్థం కాని నాయనతార ఎందుకు అని ప్రశ్నిస్తే సీన్లో ఫోకస్ బాగాలేదు అని భయపడుతూ సమాధానం ఇచ్చాడట. మరేం పర్లేదు కావాలంటే రీ టైప్ చేద్దాం అని నయనతార అంటే మేడం బాలకృష్ణ సార్ షాట్ గురించి అడగాలి…అని కంగారుపడుతూ అన్నాడట. ఈ విషయం గురించి చెప్పిన నయనతార సెట్ లో బాలకృష్ణను చూస్తే అందరూ అడవిలో పులిని చూసినట్టు భయపడతారని చెప్పింది. ఆయన వర్క్ విషయంలో ఎంతో డెడికేటెడ్ గా ఉంటారట.

 

ఇక మీరు తెలుగులో కనిపించే అవకాశం ఎప్పుడు వస్తుంది అని సుమ అడిగిన ప్రశ్నకి త్వరలోనే తన తెలుగులో చిత్రాలు చేయబోతున్నట్లు నయనతార చెప్పింది. త్వరలోనే తను మెయిన్ లీడ్ లో తెలుగు మూవీ చేయబోతున్నానని నయనతార చెప్పింది.

Related Articles

ట్రేండింగ్

UP State Board Topper: పదో తరగతి టాపర్ పై వెక్కిరింతలు.. ఈ సమాజంలో మరీ ఇంతకు దిగజారాలా?

UP State Board Topper:  ఎదుగుతున్న మనుషులని విమర్శించడం అంటే చాలామందికి ఒక సరదా. సరదా అనటం కన్నా శాడిజం అనటం ఉత్తమం. వీళ్ళ సరదాల కోసం అవతలి వాళ్ళు ఎంత సఫర్...
- Advertisement -
- Advertisement -