Balayya: బాలయ్య వాచ్ గురించి దిమ్మ తిరిగే విషయాలివే

Balayya: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నటసింహం నందమూరి బాలయ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన రేంజ్ ఏంటో, ఆయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏంటో అందరికీ తెలిసిందే. టాలీవుడ్ లో వన్ ఆఫ్ ద బిగ్ సీనియర్ హీరోగా ఆయన కొనసాగుతున్నారు. సంక్రాంతికి కానుకగా బాలకృష్ణ వీర సింహారెడ్డి అనే సినిమాతో వస్తున్నాడు.

 

గోపీ చంద్ డైరెక్షన్లో తెరకెక్కిన వీర సింహారెడ్డి సినిమా జనవరి 12వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల కానుంది. ఈ సినిమాకు ప్రముఖ మ్యూజిక్ దర్శకుడు తమన్ స్వరాలను సమకూర్చారు. ఇందులో హీరోయిన్ గా శృతిహాసన్ నటించింది. కాగా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఒంగోలులో ఈ సినిమాకి సంబంధించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. కాగా ఈవెంట్ మొదటి నుంచి ఎండింగ్ వరకు కూడా జై బాలయ్య జై జై బాలయ్య అంటూ ఫ్యాన్స్ నినదిండం అందర్నీ ఉత్సాహపరిచింది. ఈవెంట్లో బాలయ్య వేసుకున్న డ్రెస్ పై ఆయన ధరించిన వాచ్ పై అందరి చూపు పడింది.

 

బాలయ్య ధరించిన వాచ్ కి ఉన్న స్పెషాలిటీస్ సోషల్ మీడియాలో ప్రస్తుతం హల్ చల్ చేస్తున్నాయి. 1847 పారీస్ లో ఆ వాచ్ ని విడుదల చేసినట్లు సమాచారం. అంతేకాకుండా ఆ వాచ్ అంటే బాలయ్యకు ఎంతో ఇష్టమని బాలయ్య చెప్పారు. అందుకే ఆ వాచ్ ను తాను స్పెషల్ గా భావించిన సందర్భాలలో మాత్రమే ధరిస్తూ ఉంటానని బాలయ్య తెలిపారు.

 

బాలయ్య వేసుకున్న ఆ వాచ్ ను ఆయన కూతురు బ్రాహ్మిణీ బాలయ్యకు గిఫ్టుగా ఇచ్చినట్లు సమాచారం. వీరసింహారెడ్డి ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో బాలకృష్ణ చేతికి పెట్టుకున్న కార్డియార్ వాచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాలయ్య అభిమానులు ఆ వాచ్ గురించి తెలుసుకోవడం కోసం సోషల్ మీడియాలో వివరాలను సెర్చ్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -