Balayya: హీరో పరువు తీసిన బాలయ్య… నవదీప్ దండం పెట్టేశాడుగా?

Balayya: జై సినిమా ద్వారా ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి ఆ తర్వాత చందమామ, గౌతమ్ ఎస్ఎస్ సీ వంటి సినిమాల ద్వారా మంచి గుర్తింపు పొందిన నవదీప్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నవదీప్ హీరోగా రాణించలేకపోవటంతో హీరోగా అవకాశాలు తగ్గాయి. దీంతో అనేక సినిమాలలో కీలక పాత్రలలో నటిస్తూ నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఇక ఇప్పుడు నవదీప్ ప్రధాన పాత్రలో ఒక వెబ్ సిరీస్ ప్రసారం కాబోతోంది. ప్రస్తుత కాలంలో ఓటీటీల హవా నడుస్తోంది.

 

ఈ క్రమంలో ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా ఎన్నో వైవిధ్యమైన షోలు, సినిమాలు, సిరీస్ లను నిర్మిస్తోంది.
ఇక తాజాగా హీరో నవదీప్, బిందు మాధవి ప్రధాన పాత్రల్లో “న్యూసెన్స్” వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ ప్రవీణ్ దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. తాజాగా న్యూసెన్స్ ప్రమోషన్స్ లో భాగంగా ఇండియన్ ఐడల్ 2 తాజా ఎపిసోడ్ కు నవదీప్, బిందు మాధవి సందడి చేశారు.

ఈ షో లో న్యాయ నిర్ణేతలతో పాటు బాలకృష్ణ ఉన్నారు. ఈ క్రమంలోనే నవదీప్ గురించి బాలకృష్ణ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు బయట పెట్టాడు. ఇక జర్నలిజం మీద కొత్తగా వెబ్ సిరీస్ చేశాం సార్ అని నవదీప్ చెప్పగానే.. ‘జర్నలిజం మీదనా.. అంటే ఆదివారం పొద్దున టీవీ పెడితే.. శనివారం సాయంత్రం నవదీప్ ఎక్కడో దొరికిపోయాడు. అర్ధరాత్రి కారు వదిలి పారిపోయాడు. డ్రంక్ అండ్ డ్రైవ్ లో క్యాచ్.. ఇదే కదా న్యూస్.. రివేంజా’ అని బాలకృష్ణ ఫన్నీగా నవదీప్ పరువు తీశారు.

 

ఈ విధంగా బాలయ్య చేసినటువంటి వ్యాఖ్యలపై నవదీప్ స్పందిస్తూ.. ‘సార్.. మీడియా వాళ్లతో సెటైర్ వేస్తే రిటైర్ అయిపోతానని చాలా చిన్న వయసులోనే తెలుసుకున్నాను’ అని అన్నాడు. అంటే నీకు పాపులారిటీ వచ్చిందే వాళ్ల వల్ల అని బాలకృష్ణ అన్నాడు. దీంతో అక్కడున్న వాళ్లంత ఒక్కసారిగా నవ్వేశారు. ఆ తర్వాత బాలకృష్ణ చేతుల మీదుగా న్యూసెన్స్ టీజర్ రిలీజ్ చేశారు. ఏది ఏమైనా బాలకృష్ణ ఈ వేదికగా నవదీప్ పరువు మొత్తం తీశారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -