Balayya-CM YS Jagan: సీఎం జగన్ ను టార్గెట్ చేసిన బాలయ్య.. ఆ డైలాగ్స్ తో?

Balayya-CM YS Jagan: స్టార్ హీరో బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన వీరసింహారెడ్డి మూవీ నుంచి పవర్ ఫుల్ ట్రైలర్ తాజాగా విడుదలైంది. ఫ్యాన్స్ బాలయ్యను ఏ విధంగా చూడాలని కోరుకుంటున్నారో గోపీచంద్ మలినేని బాలయ్యను అదే విధంగా చూపించారని సోషల్ మీడియాలో కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ట్రైలర్ బాలయ్య మార్క్ డైలాగ్స్ తో నిండిపోగా బాలయ్య ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ గ్యారంటీ అని ఈ ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు.

సంక్రాంతి పండుగకు విందు భోజనం లాంటి మూవీతో బాలయ్య ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ట్రైలర్ లో బాలయ్య రెండు గెటప్స్ లో కనిపించగా ఈ రెండు గెటప్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. ట్రైలర్ లో సీఎం జగన్ ను టార్గెట్ చేసే విధంగా డైలాగ్స్ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతోంది. 145 సెకన్ల నిడివితో విడుదలైన ఈ ట్రైలర్ లో డైలాగ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉండటం గమనార్హం.

వరలక్ష్మీ శరత్ కుమార్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో అదరగొట్టారు. “సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు మార్చలేరు”, “పదవి చూసుకుని నీకు పొగరేమో బై బర్త్ నా డీ.ఎన్.ఏ ” కే పొగరెక్కువ అనే డైలాగ్స్ తో బాలయ్య ఆకట్టుకున్నారు. వైసీపీ నేతలకు మండేలా ఉన్న ఈ డైలాగ్ లపై వాళ్లు ఏ విధంగా రియాక్ట్ అవుతారో చూడాలి.

ట్రైలర్ లోనే ఈ రేంజ్ లో డైలాగ్స్ ఉన్నాయంటే సినిమాలో ఏ రేంజ్ లో ఉన్నాయో అని కామెంట్లు వినిపిస్తున్నాయి. బాలయ్య ఖాతాలో అఖండ ను మించిన బ్లాక్ బస్టర్ చేరబోతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ట్రైలర్ లో శృతి హాసన్, హనీ రోజ్ అందంగా కనిపించారు. బాలయ్య నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ తో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకునేలా ఉన్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Liquor: పేద కుటుంబాలతో జగన్ చెలగాటం.. సర్కారు మద్యం తాగితే ప్రాణాలకే ప్రమాదమా?

AP Liquor: గత ఎన్నికల ముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తాను అధికారంలోకి వస్తే మధ్యపానాన్ని విడతలవారీగా పూర్తిగా నిషేధిస్తాను అంటూ తన నవరత్నాలలో ఒక రత్నంగా మద్యపాన నిషేధాన్ని చేర్చారు....
- Advertisement -
- Advertisement -