Bandla Ganesh: ఆదిపురుష్ టీజర్ పై బండ్ల గణేష్ రివ్యూ ఇదే.. ప్రభాస్ అలా ఉన్నారంటూ?

Bandla Ganesh: గత కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా టీజర్ గురించి అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. ఈ టీజర్ పూర్తిగా కార్టూన్ సినిమాలా ఉందని కొందరు అంటున్నారు. మరికొందరు 500 కోట్లు ఖర్చుపెట్టి పాన్ ఇండియా స్టార్ తో కార్టూన్ సినిమా చేశారని దెప్పి పొడుస్తున్నారు. ఏదేమైనా టీజర్ విడుదలయితే ఆ టీజర్ సినిమా మీద అంచనాలు పెంచాలి.

కానీ ఆది పురుష్ టీజర్ మాత్రం ప్రభాస్ అభిమానులను నిరాశపరిచిందనే చెప్పవచ్చు. ఈ విషయంలో కోలీవుడ్ ప్రేక్షకులు పొన్నియన్ సెల్వన్ సినిమాను దెప్పి పొడిచిన నేపథ్యంలో ఇప్పుడు ప్రభాస్ అభిమానులను మరో స్థాయిలో ఏకిపారేస్తున్నారు. అయితే తాజాగా ప్రభాస్ ఆది పురుష్ లుక్ పై బండ్ల గణేష్ ఒకటి ట్వీట్ చేసాడు. ఆది పురుష్ పోస్టర్ ను పోస్ట్ చేసిన గణేష్.. కళ్ళల్లో రాజసం, మీషంలో పౌరుషం అచ్చం శ్రీ రామచంద్ర మహా ప్రభు లాగా ఉన్న ప్రభాస్.

అంటూ ఇతడు ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఇతడు చేసిన ట్వీట్ కి ప్రభాస్ అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వారంతా బండ్ల గణేష్ కి కామెంట్ల రూపంలో కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. కానీ ఈ విషయాన్ని మాత్రం యాంటీ ఫ్యాన్స్ ఒప్పుకోవడం లేదు. ఇదొక కార్టూన్ సినిమా అంటూ ఏకి పారేస్తున్నారు. ఫస్ట్ లుక్, టీజర్లు ఏమాత్రం బాగోలేదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఏదేమైనా ఆది పురుష్ సినిమా టీజర్ నిరాశ పరిచింది అన్న విషయం మాత్రం వాస్తవం. ఈ సినిమా టీజర్ పూర్తిగా కార్టూన్ నేపథ్యంలో కనిపించడం ద్వారా ప్రభాస్ అభిమానులు నిరాశ పడక తప్పలేదు. మరి ఇన్ని ట్రోల్స్ మధ్య ఈ సినిమాతో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాస్ ఏ విధంగా ఆకట్టుకుంటాడో చూడాలి. ఏదేమైనా ఈ టీజర్ విషయంలో ప్రభాస్ అభిమానులు అనేక రకాల అవమానాలు ఎదుర్కొంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

AP Youth Turns as GIG Workers: హైదరాబాద్ లో గిగ్ వర్కర్లుగా లక్షల సంఖ్యలో ఏపీ యువత.. ఈ పరిస్థితి దారుణమంటూ?

AP Youth Turns as GIG Workers: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ గిగ్ వర్కర్లతో సమావేశం ఏర్పరచగా అందులో సకానికి పైగా ఆంధ్రప్రదేశ్ యువత వున్నది అని తెలిసింది....
- Advertisement -
- Advertisement -