Bank Holidays: ఈ నెలలో భారీగా సెలవులు.. బ్యాంక్‌ వినియోగదారులు అలర్ట్‌ అవ్వండి!

Bank Holidays: ఒకప్పుడు డబ్బులు జమచేయాలన్నా.. తీసుకోవాలన్నా.. బ్యాంకుల కు పరుగులు తీసి క్యూలైన్లలో నిలబడితేనే ఆ పనులు జరిగేవి.ప్రస్తుతం ఏటీం మిషిన్లు, స్వైప్‌ మిషిన్లు, నెట్‌ బ్యాకింగ్, ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులోకి వచ్చిన తర్వాత బ్యాంకుకు ఎవరూ వెళ్లడం లేదు.అత్యమసరం,బంగారం పెట్టడం, చెక్కులు డ్రా చేయడం ఉంటేను బ్యాంకులకు వెళ్తున్నారు. అయినా కొన్ని పనులకు మాత్రం కచ్చితంగా బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది.

అయితే.. కొందరు వివిధ పనులపై ప్రతి రోజూ బ్యాంకులకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ విధంగా బ్యాంక్‌కు వెళ్లాలను కునే వారు ముందస్తుగా ప్లాన్‌ చేసుకోవాలి. ఎందుకంటే సెప్టెంబర్‌ నెలలో కూడా చాలా రోజులు బ్యాంకులకు సెలవులు ఉండనున్నాయి. అందుకే ఈ నెలలో బ్యాంక్‌కు వెళ్లాలనుకునే వారు తేదీలను గుర్తించుకుని ప్లాన్‌ చేసుకోవాలి. లేకుంటే కొన్ని సందర్భాల్లో సమస్యలు ఎదుర్కుకోవాల్సి వస్తోంది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన సెలవుల క్యాలెండర్‌ ప్రకారం ఈ నెలలో 14 రోజులు హాలిడే ఉంటాయి.

సెప్టెంబర్‌లో శని, ఆదివారాలతో 6 సెలవులు ఉండగా 8 ప్రత్యేక సెలవులు ఉన్నాయి. దీంతో సెప్టెంబర్‌ నెలలో బ్యాంకులు 14 రోజులు మూసి ఉంటాయి. అయితే ఈ సెలవులు ఇండియా మొత్తం ఒకేలా ఉండవు ఆయా రాష్ట్రాల్లోని పండగలు, ప్రత్యేక సందర్భాలను బట్టి సెలవులు ఉంటాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం కేవలం రెండో, నాలుగో శని వారం, నాలుగు ఆదివారాలు కలిపి మొత్తం 6 మాత్రమే సెప్టెంబర్‌ నెల సెలవుగా ఉన్నాయి సెప్టెంబర్‌లో హైదరాబాద్‌ సర్కిల్‌లో పండుగలు, పర్వదినాలు ఎలాంటివి లేకపోవడంతో స్పెషల్‌ హాలిడేస్‌లు ఉండవు. కానీ ఇతర సర్కిళ్లల్లో బ్యాంకులకు సెలవులు ఉన్నాయి.

సెప్టెంబర్‌లో సెలవుల వివరాలు..

సెప్టెంబర్‌–1న గోవాలో వినాయక చవతి
సెప్టెంబర్‌ –6న రాంచిలో కర్మపూజ
సెప్టెంబర్‌ –7న కేరళలో ఫస్ట్‌ ఓనమ్‌
సెప్టెంబర్‌ –8న కేరళలో తిరువోనం
సెప్టెంబర్‌ –9న సిక్కింలో ఇంద్రజాత్ర
సెప్టెంబర్‌–10న కేరళలో నరవణ గురు జయంతి
సెప్టెంబర్‌– 21న కేరళలో నారాయణ గురు సమాధి దినం
సెప్టెంబర్‌– 26న మణిపాల్‌లో నవరాత్రి స్థాపన పండగ. అన్ని రాష్ట్రాల్లో ఈ సెలవులు ఉండవు. ఆయా రాష్ట్రాల్లోని పండగలు, ప్రత్యేక రోజులను బట్టి సెలవులు ఉంటాయి.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -