Heart Attack: గుండెపోటు వేకువజామున రావడానికి కారణం అదే!

Heart Attack:  ఒకప్పుడు గుండెపోటు చాలా తక్కువగా వచ్చేది. పది మందిలో ఒకరికో.. ఇద్దరికి వచ్చేది. నేటి కాలంలో వయస్సుకు సంబంధం లేకుండా గుండెపోటును ఎదుర్కోవాల్సి వస్తోంది. అది ఎప్పుడు వస్తుందో ఎలా వస్తుందోనని చాలా మంది భయపడుతుంటారు. ఈ గుండెపోటు అనేది ఎక్కువగా అర్ధరాత్రి, తెల్లవారుజామున వస్తూ ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తుంటారు. మానవ శరీరంలో అంతర్గత గడియారంగా ప్రసిద్ధి చెందిన ’సిర్కాడియన్‌ వ్యవస్థ’ ఇందుకు కారణమని అధ్యయనాలు చూపించాయని నిపుణులు భావిస్తున్నారు.

బ్రిగ్‌ హామ్‌ కు చెందిన ఒరెగాన్‌ హెల్త్‌ అండ్‌ సైన్స్‌ యూనివర్సిటీ చేసిన ఓ అధ్యయనం ప్రకారం.. శరీరం విడుదల చేసే ’సైటోకినిస్‌’ అరిథ్మియాకు కారణమవుతుంది. ఇదే ఆకస్మిక కార్డియాక్‌ అరెస్ట్‌ సంభావ్యతను పెంచుతుందట. ‘సిర్కాడియన్‌ వ్యవస్థ’ రిథమ్‌ రోజంతా తగ్గుతూ, పెరుగుతూ ఉంటుండటంతో మెదడుతో పాటు రక్త కణాల్లో కొన్ని రసాయనాలు పెరుగుతూ తగ్గుతూ ఉంటాయి అని బ్రిన్హమ్‌ అండ్‌ ఉమెన్స్‌ హాస్పిటల్లో మెడికల్‌ క్రోనేలయాలజీ ప్రోగ్రామ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ ప్రాంట్‌ స్కీర్‌ పరిశోధనలో పేర్కొన్నారు.

తెల్లవారుజామున 4 నుంచి 10 గంటల మధ్య బ్లడ్‌ ప్లేట్లెట్స్‌ అతుక్కొని ఉన్నప్పుడు చాలా వరకు కార్డియాక్‌ అరెస్టు జరుగుతాయని, అడ్రినల్‌ గ్రంథుల నుంచి ఉత్పన్నమయ్యే ఆడ్రిపలీన్‌ పెరగడం వల్ల కరోనరీ ధమనుల్లో ఫలకం చీలిపోతుందని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం గుండెపోటు లేదా గుండె ఆగిపోవడానికి అత్యంత సాధారణ కారణం కరోనరీ హార్ట్‌ డిసీజ్‌. రోజులు గడిచేకొద్ది ధమని గోడల వెంట పలకం(ప్లేక్‌) పేరుకుపోయి రక్తనాళాలను ఇరుకుగా చేస్తుంది. గుండెకు రక్త ప్రవాహాన్ని తగ్గించడం లేదా పూర్తిగా నిరోధించడం ద్వారా ఈ సమస్య తీవ్రంగా మారుతుంది.కార్డియాక్‌ అరెస్టు సంబంధించి స్త్రీ పురుషులు ఇద్దరికీ పలు రకాల సంకేతాలు, లక్షణాలు ఉన్నాయి. మహిళలు అజీర్ణం లేదా గ్యాస్‌ను పోలి ఉండే సూక్ష్మ లక్షణాలను కలిగి ఉండగా.. పురుషులకు మరింత బలమైన సంకేతాలు ఉన్నాయి.

లక్షణాలు ఇవే..

కార్డియాక్‌ అరెస్టుకు ముందు శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తాయి. మొదటగా ఛాతిలో నొప్పి, ఛాతిపై భారం, ఒత్తిడి వికారం, అజీర్ణం, గుండెల్లో మంట వంటి భావాలు అనిపిస్తాయి. కడుపులో నొప్పి శ్వాస ఆడకపోవడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది చల్లని చెమటలు రావడం, ఆకస్మిక అలసట కూడా వస్తుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -