BCCI: ఈ ముగ్గురు ప్లేయర్లపై వేటు వేసేందుకు సిద్ధమైన బీసీసీఐ!

BCCI: టి20 ప్రపంకచకప్ లో వైఫల్యాన్ని చవిచూసిన భారత్ ఇక తన శోకం నుంచి బయటకు వచ్చి నెక్స్ట్ ఇయర్ జరగబోతున్న వన్డే ప్రపంచ కప్ కోసం కుస్తీ మొదలు పెట్టింది. ఈ సారి జరిగే 2023 వన్డే వరల్డ్ కప్ కు భారత్ వేదికగా ఉండడం తో రాబోతున్న మాచ్ ఇంకా ప్రతిష్ఠాత్మకంగా మారింది. కాబట్టి టీం ఇండియా ఈ మ్యాచ్ కోసం దసరత్తు మొదలు పెట్టేది సదా పయనిస్తుంది.

ఎలాగైనా కప్పు సాధిస్తామనే దృఢ నిశ్చయంతో ఆస్ట్రేలియా లో అడుగుపెట్టిన టీమిండియా కు అనూహ్యంగా నిరాశ ఎదురయింది. ఎలాగైనా ఫైనల్స్ కి దూసుకుపోవాలి అని బరిలోకి అడుగుపెట్టిన భారత్ సెమీఫైనల్స్ గండం మాత్రం గట్టెక్క లేకపోయింది.

ఇప్పుడు సొంత గడ్డపై ఎలాగైనా సరే తన సత్తాను చాటుకుని విశ్వవిజేతగా నిలబడాలన్న పట్టుదలతో భారత్ టీమ్ ప్రాక్టీస్ లో మునిగి తేలుతున్నారు. అయితే ప్రస్తుతం వన్డే ప్రపంచ కప్పుకు సిద్ధమవుతున్న భారత్ ముందు ఉన్న ప్రధాన సమస్యలు రెండు అందులో మొదటిది బౌలింగ్ అయితే మరొకటి కూర్పు.

ఈసారి బరిలోకి దిగబోతున్న టీమిండియా జట్టు లో స్థానం కోసం చాలామంది ప్లేయర్లు పోటీ పడుతున్నారు. కానీ వీరిలో సరైన వాళ్ళని ఎంచుకోవడంపై సెలెక్టర్లు తికమక పడుతున్నారు.

ఈ నేపథ్యంలో టీం కు సంబంధించిన ముగ్గురు ప్లేయర్ల పరిస్థితి డేంజర్ జోన్ లో ఉంది. శిఖర్ ధావన్,రిషభ్ పంత్ మరియు శార్దుల్ ఠాకూర్ లు టీమ్ ఇండియా కు సంబంధించిన వన్డే వరల్డ్ కప్ సెలక్షన్స్ లో గట్టెక్కడం కష్టమని సమాచారం.

శిఖర్ ధావన్ కు రేపు డిసెంబర్ 5 కి 37 ఏళ్లు పూర్తి అవుతుంది.
కనుక అతని సెలక్షన్ పై కాస్త భిన్నభిప్రాయాలు ఉన్నాయి. ఈమధ్య జరిగిన మ్యాచ్లో అతని పర్ఫామెన్స్ నిలకడగా లేకపోవడం, బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ డల్ గా ఉండడం కూడా అతనికి మైనస్ పాయింట్స్ అని చెప్పొచ్చు. టీమిండియాలో ఈసారి స్తానం దక్కించుకోవాలి అంటే అతను తన స్ట్రైక్ రేట్ తో పాటు పెర్ఫార్మెన్స్ లెవెల్ ని కూడా పెంచాలి.

ఇక రిషభ్ పంత్ గత కొద్ది కాలంగా ఫామ్ లో లేడని చెప్పొచ్చు. ఎటు బిసిసి అభిమానులు కూడా అతని పై విమర్శలు కురిపిస్తున్నారు . ఈ నేపథ్యంలో ఈసారి సెలక్షన్స్ ను అతడు దాటగలడా లేదా అనేది అనుమానమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

 

అలాగే శార్దుల్ ఠాకూర్ నిలకడగా రాణించడం లేదు అన్న అభిప్రాయం టీం సభ్యులలోనే కాకుండా బోర్డు మెంబర్లలో కూడా బలంగా ఉంది. ఒక మ్యాచ్లో మైండ్ బ్లోయింగ్ పర్ఫామెన్స్ ఇస్తే …మరసటి బ్యాచ్ లో పేలవంగా పెర్ఫార్మ్ చేస్తాడు…ఇలా ఉన్న పర్ఫామెన్స్ బేస్ చేసుకొని వరల్డ్ కప్ లో లక్కీ డ్రా ఆరడం సాధ్యం కాదు కదా? మరి ఈ ముగ్గురు బౌలర్లో ఎవరు నిలబడతారో, ఎవరు ఎలిమినేషన్ బారిన పడతారో వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Note for Vote Case: ఓటుకు నోటు కేసును కావాలనే తెరపైకి తెస్తున్నారా.. చంద్రబాబును కావాలనే టార్గెట్ చేస్తున్నారా?

Note for Vote Case:  ఓటుకు నోటు కేసు రెండు తెలుగు రాష్ట్రాలలో అప్పట్లో ఎలాంటి సంచలనాలను సృష్టించినదో మనకు తెలిసిందే. ఇలా ఓటుకు నోటు కేసులో భాగంగా చంద్రబాబు నాయుడు రేవంత్...
- Advertisement -
- Advertisement -