BCCI: దేశవాళీల్లో ఆడాల్సిందేనంటూ ఆటగాళ్లకు బీసీసీఐ ఆదేశాలు!

BCCI: ఇటీవల కాలంలో టీమిండియా స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోతోంది. ముఖ్యంగా ఐసీసీ టోర్నీల్లో చెత్త ఆటతీరుతో అందర్నీ నిరాశపరుస్తోంది. స్టార్లుగా పేరున్న ప్లేయర్లు పెద్ద మ్యాచుల్లో ఘోరంగా విఫలమవుతున్నారు. ఆసియా కప్, టీ20 వరల్డ్ కప్ ఓటములే ఇందుకు ఉదాహరణ. న్యూజిలాండ్ పర్యటనలో టీ20 సిరీస్ గెలిచినప్పటికీ వన్డే టోర్నీలో ఓడిపోయింది. అదే విధంగా బంగ్లాదేశ్ చేతిలోనూ పరాజయం పాలైంది. దీంతో జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి.

 

భారత క్రికెటర్లు డబ్బు కోసమే క్రికెట్ ఆడుతున్నారని.. వారికి ఐపీఎలే ముఖ్యమంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. బీసీసీఐకి ఐపీఎల్ తప్ప ఇంటర్నేషనల్ క్రికెట్ అవసరం లేదంటూ విమర్శలు వినిపిస్తున్నాయి. దీంతో ఆటగాళ్లపై కఠిన వైఖరి అవలంబించాలని బోర్డు నిర్ణయానికి వచ్చేసింది. ఇందులో భాగంగా జాతీయ జట్టుకు ఎంపికవ్వని వారికి విశ్రాంతి ఇవ్వకుండా.. దేశవాళీ క్రికెట్ ఆడటంపై దృష్టి సారించాలని ఆదేశించినట్లు తెలిసింది.

 

ఇటీవల కాలంలో టీమిండియా ప్లేయర్లు తరచూ గాయాలపాలవుతున్న నేపథ్యంలో ఫిట్ నెస్ ను మెరుగు పర్చుకోవడంపై బీసీసీఐ ఫోకస్ చేయాలని చెప్పిందట. అందుకోసం డొమెస్టిక్ క్రికెట్ ఆడాల్సిందిగా ప్లేయర్లకు రోజర్ బిన్నీ నేతృత్వంలోని ఆఫీస్ బేరర్ల కొత్త బృందం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

 

రంగంలోకి దిగిన సూర్య, చహల్
బీసీసీఐ ఆదేశాలు అప్పుడే అమల్లోకి వచ్చేసినట్లు కనిపిస్తోంది. ప్రస్తుతం విశ్రాంతిలో ఉన్న టీ20 స్పెషలిస్టు సూర్యకుమార్‌‌ యాదవ్ తోపాటు స్పిన్నర్ యుజువేంద్ర చహల్ తాజాగా రంజీ ట్రోఫీలో పాల్గొన్నారు. ఇప్పటికే ఫస్ట్ రౌండ్ మ్యాచుల్లో సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ జాయిన్ కాగా.. ఇప్పుడు సూర్య, చహల్ కూడా వచ్చి చేరడం గమనార్హం. కాగా, ముంబై తరఫున మంగళవారం బరిలోకి దిగిన సూర్య.. వచ్చీ రాగానే బౌలర్లపై మెరుపులా విరుచుకుపడ్డాడు. తుఫాన్ బ్యాటింగ్ తో 80 బంతుల్లో 15 ఫోర్లు, సిక్సర్‌ సాయంతో 90 పరుగులు చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Mahanadu: ఆ కీలక నేతలు మహానాడుకు ఆ రీజన్ వల్లే మిస్ అయ్యారా?

Mahanadu: మహానాడు కార్యక్రమం ముగిసింది. 2024 ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా బాబు ఈ మ‌హానాడును తీర్చిదిద్దారు. ఎన్టీఆర్ ఫ్రేమ్‌ త‌న ఇమేజ్‌ క‌ల‌గ‌లిపి వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీని ఓడించాల‌నేది చంద్ర‌బాబు వ్యూహం. అయితే...
- Advertisement -
- Advertisement -