Virat Kohli: కోహ్లీ డిమాండ్‌ను ఆచరణలో పెడుతున్న బీసీసీఐ

Virat Kohli: బీసీసీఐ నిర్ణయాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. గతంలో వన్డే వరల్డ్ కప్‌లో ఆడే ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా బీసీసీఐ జాగ్రత్తలు తీసుకోవాలని.. అందులో భాగంగా ఐపీఎల్‌లో సదరు ఆటగాళ్లపై పనిభారం తగ్గించేలా బీసీసీఐ చూడాలని విరాట్ కోహ్లీ డిమాండ్ చేశాడు. కానీ అప్పట్లో బీసీసీఐ కోహ్లీ ప్రతిపాదనను పట్టించుకోలేదు. ఆటగాళ్లకు విశ్రాంతి ఇవ్వాలని కోట్లు కుమ్మరించి వారిని కొనుగోలు చేసిన ఫ్రాంచైజీలకు ఎలా చెప్తాం అంటూ కోహ్లీపై బీసీసీఐ సీరియస్ అయ్యింది.

 

కట్ చేస్తే ఇప్పుడు విరాట్ కోహ్లీ డిమాండ్‌ను బీసీసీఐ పరిగణనలోకి తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది స్వదేశంలో జరిగే వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో పెట్టుకుని కీలక ఆటగాళ్లకు ఐపీఎల్‌లో తగినన్ని మ్యాచ్‌లలో విశ్రాంతి ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని ఫ్రాంచైజీలకు బీసీసీఐ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. వన్డే వరల్డ్ కప్ కోసం మొత్తం 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేశామని, వాళ్లంతా ఐపీఎల్‌లో మరీ ఎక్కువ స్ట్రెస్ అవకుండా చూసుకోవాలని బీసీసీఐ నిర్ణయించింది.

 

దీంతో బీసీసీఐ తీరుపై పలువురు క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కోహ్లీ ప్రతిపాదనను బుట్టదాఖలు చేసిన బీసీసీఐ ఇప్పుడు అదే ప్రతిపాదనను ఆచరణలో పెట్టడాన్ని చూసి నోరెళ్లబెడుతున్నారు. ఇప్పటికైనా కోహ్లీ చెప్పిన విషయాలను గ్రహించినందుకు సంతోషంగా ఉందని పలువురు కామెంట్ చేస్తున్నారు.

 

వరల్డ్ కప్‌లో కీలక ఆటగాళ్లు ఆడతారా?
ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్‌కు కీలక ఆటగాళ్లు అందుబాటులో ఉండటం లేదు. రవీంద్ర జడేజా, బుమ్రా, రిషబ్ పంత్ లాంటి ఆటగాళ్లు గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. వీళ్లు ఐపీఎల్‌లో ఆడతారా లేదా దూరంగానే ఉంటారా అన్న విషయంపై సందిగ్ధత నెలకొంది. ఒకవేళ ఐపీఎల్‌లో ఆడితే ప్రపంచకప్‌కు కూడా అందుబాటులో ఉంటారు. లేకపోతే తగినంత మ్యాచ్ ప్రాక్టీస్ ఉండదు కాబట్టి ప్రపంచకప్ జట్టులోకి రావడం కష్టతరంగా మారుతుంది. రోడ్డు ప్రమాదానికి గురైన పంత్ మాత్రం ఐపీఎల్‌లో ఆడే అవకాశం లేదని తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

ఏపీలో ఆడుదాం ఆంధ్ర పోటీలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలంటే?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ఎప్పటికప్పుడు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ విద్యార్థులు, యువతకు మేలు చేస్తున్న సంగతి తెలిసిందే. జగన్ సర్కార్ ఆడుదాం ఆంధ్ర పేరుతో క్రీడా పోటీలను నిర్వహిస్తుండగా...
- Advertisement -
- Advertisement -