BCCI: బీసీసీఐ సంచలన నిర్ణయం.. టీమిండియా స్టార్ ఆటగాళ్ల టీ20 కెరీర్ ముగిసినట్లేనా?

BCCI: ప్రస్తుతం శ్రీలంకతో టీమిండియా వన్డే సిరీస్ ఆడుతోంది. ఈ సిరీస్ ముగియగానే స్వదేశంలో న్యూజిలాండ్‌తో వరుసగా వన్డేలు, టీ20లను టీమిండియా ఆడనుంది. ఈ మేరకు సెలక్టర్లను వేర్వేరుగా జట్లను ప్రకటించారు. అయితే బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు సీనియర్ ఆటగాళ్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలను దూరం పెట్టింది. దీంతో వీళ్ల టీ20 కెరీర్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. వన్డే ప్రపంచకప్ కోసం బీసీసీఐ వీళ్లను దూరం పెడుతుందా లేదా ఇతర ఉద్దేశమా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

 

న్యూజిలాండ్‌తో వన్డే, టీ20 సిరీస్‌లకు కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఫ్యామిలీ కమిట్‌మెంట్స్ కారణంగా వాళ్లను ఎంపిక చేయలేదని సెలక్టర్లు వివరించారు. ఈ నెలాఖరులో కేఎల్ రాహుల్ తన ప్రేయసి అతియా శెట్టిని వివాహం చేసుకోనున్న సందర్భంగా అతడిని సెలక్టర్లు ఎంపిక చేయలేదని సమాచారం. అటు ఆల్‌రౌండర్ అక్షర్ స్థానంలో షాబాజ్ అహ్మద్‌ను సెలెక్టర్లు ఎంపిక చేశారు.

 

న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు 29 ఏళ్ల వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ జితేష్ శర్మకు జట్టులో చోటు దక్కింది. శ్రీలంకతో టీ20 సిరీస్‌లో సంజు శాంసన్ గాయపడటంతో జితేష్ శర్మకు అవకాశం లభించింది. అటు టీమిండియాలోకి పునరాగమనంపై చాలా కాలంగా కసరత్తు చేస్తున్న ఓపెనర్ పృథ్వీ షాకు కూడా న్యూజిలాండ్‌తో జరిగే టీ20 సిరీస్‌లో అవకాశం దక్కింది. ఆస్ట్రేలియాతో టెస్టు జట్టులో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్‌లకు కూడా చోటు లభించడం గమనార్హం.

 

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, కేఎస్ భరత్, హార్దిక్ పాండ్యా, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, శార్దూల్ ఠాకూర్, యుజ్వేంద్ర చాహల్, కుల్దీప్ యాదవ్, మహమ్మద్ షమీ, మహమ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

 

న్యూజిలాండ్‌తో సిరీస్‌కు భారత టీ20 జట్టు: హార్దిక్ పాండ్యా (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శుభ్‌మన్ గిల్, పృథ్వీ షా, దీపక్ హుడా, రాహుల్ త్రిపాఠి, జితేశ్ శర్మ, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్ దీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్, శివం మావి, ముఖేష్ కుమార్

 

ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్టుకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), శుభ్‌మన్ గిల్, పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎస్ భరత్, ఇషాన్ కిషన్, అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేష్ యాదవ్, జైదేవ్ ఉనద్కట్, సూర్యకుమార్ యాదవ్

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -