Health Tips: ఆ గుర్తులున్న ట్యాబ్లెట్లను మాత్రమే వాడాలి.. లేదంటే ప్రమాదమే!

Health Tips: సాధారణ జ్వరాలు వచ్చినప్పుడు చాలా మంది ఆస్పత్రులకు వెళ్లకుండా సమీపంలోని మెడికల్‌ హాళ్ల నుంచి వారికి తెలిసిన ట్యాబ్లెట్లు తీసుకుని వాడుతుంటారు. వైద్యులు సలహాలు లేకుండానే నేరుగా ఫలనా ట్యాబ్లెట్‌ అంటూ కొనుగోలు చేస్తుంటారు. మనం ఏ మందులైతే కొనుగోలు చేస్తామో వాటి వెనుక క్లుప్తంగా రాసి ఉంటుంది. వాటిని కొందరు మాత్రమే ఫాలో అవుతారు. చాలా మందికి అవేమి పట్టింరుకోకుండా ట్యాబ్లెట్లు తీసుకుంటారు. మనం తీసుకుని ట్యాబ్లెట్‌ ప్యాకెట్‌ వెనక ఎఫ్‌ఎక్స్‌, ఎన్‌ఎఫ్‌ఎక్‌, ఎక్స్‌ ఆర్‌ ఎస్‌ అని రాసి ఉంటుంది. దీన్ని అందరూ గమనిస్తారు కానీ.. దాని అర్థం ఏంటో ఎందుకు రాస్తారో అంతగా పట్టించుకోరు.

మందులు ప్యాకట్‌పై వివిధ రకాల గుర్తులు ఉంటాయి. ఈ గుర్తులు ఊరికే ఇవ్వలేదు. వాడే విధానం ఔషధం వినియోగానికి సంబంధించిన సూచనలు కూడా ఉన్నాయి. ఇలాంటి గుర్తుల్లో ఆర్‌ఎక్స్‌ కూడా ఒకటి. ఆర్‌ఎక్స్‌ అని రాసి ఉంటే ఇలాంటి మందులను డాక్టర్‌ సలహా మేరకే వాడాలని అర్థం. మెడికల్‌ దుకాణానికి వెళ్లి మండులు కొనుగోలు చేస్తున్నప్పుడు వాటిపై ఇలాంటి గుర్తులు కనిపిస్తే డాక్టర్‌ సలహా లేకుండా వీటిని కొనుగోలు చేయరాదని అర్థం చేసుకోవాలి.

ట్యాబ్లెట్‌ ప్యాకెట్‌ వెనక ఎన్‌ఆర్‌ఎక్స్‌ రాసి ఉంటే అటువంటి మందులను సూచించడానికి లైసెన్స్ ఉన్న వైద్యులు మాత్రమే ఇలాంటి మందులను సూచించగలదని అర్థం. ఇటువంటి ఔషధం ఏదైనా మెడికల్ స్టోర్ ద్వారా ఇచ్చినా కొనుగోలు చేయకూడదు. ఎందుకంటే అది చెడు ప్రభావం చూపుతోం‍ది. ఇది కాకుండా, ఔషధ ప్యాకెట్ వెనుక ఎక్స్‌ ఆర్‌ ఎక్స్‌ గుర్తు కూడా ఉంటుంది. ఔషధం ప్యాకెట్ వెనుక ఎక్స్‌ ఆర్‌ ఎక్స్‌ గుర్తు ఉంటే, అలాంటి మందులు డాక్టర్ నుంచి మాత్రమే తీసుకోవాలి. వైద్యుడు చీటీ రాసిచ్చినా కూడా అలాంటి మందులు బయట నుంచి కొనుగోలు చేయారాదని సూచిస్తున్నారు.

Related Articles

- Advertisement -

ట్రేండింగ్

LIC policy: ఈ ఎల్ఐసీ పాలసీ గురించి తెలుసా.. రూ.కోటి పొందే అవకాశం!

LIC policy: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వేర్వేరు వర్గాల కస్టమర్ల కోసం పలు రకాల పాలసీలను అందిస్తోంది. కస్టమర్ల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు వేర్వేరు ఎల్ఐసీ పాలసీలను ప్రకటిస్తూ...
- Advertisement -