Apples: యాపిల్‌ను వాళ్లు తినకూడదంట.. నిజమా?

Apples: సామాన్యంగా జ్వరం వస్తే ఎవరు కూడా ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోరు. అలాంటి సమయంలో వారికి ఏమీ తినాలనిపించదు. అయితే ఎలాంటి ఆహారం తీసుకోకపోవడంతో వారు మరింత బలహీనులవుతారు.మెడిసిన్‌ తీసుకుంటున్న సమయంలో ఏదైనా తినాలని వైద్యలు సూచిస్తుంటారు. అలాంటప్పుడు రోగ నిరోధక శక్తికోసం వివిధ పండ్లను తీసుకుంటుంటారు. పండ్లతో పాటు వాటి రసాలు (జ్యూస్‌) చేసుకుని తాగుతుంటారు. అయితే.. ఎక్కువ మంది యాపిల్‌ పండ్లనే ఇష్టపడుతారు. ప్రపంచంలో పండ్ల వినియోగంలో అరటి పండ్ల తర్వాత యాపిల్‌నే ఎక్కువగా ఇష్టపడుతారు.

యాపిల్‌ తింటే ఇమ్యూనిటీతో పాటు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారని తరతరాలుగా చెబుతూ వస్తున్నారు. అయితే అది వాస్తవమా.. నిజంగా యాపిల్‌ తింటే ఆరోగ్యంగా ఉంటామా.. యాపిల్‌ను అన్ని వయస్సుల వారు తినొచ్చా.. ఎవరేవరూ తినొచ్చు అనే ప్రశ్నలు చాల మందిలో తలెత్తున్నాయి.వాస్తవానికి యాపిల్‌ రోగనిరోధక శక్తిని ఇచ్చినా ఆయుర్వేదం ప్రకారం ఒకేరకమైన ఆహారం తినకూడదట. ఒకే రకమైన పండ్లు అయినా వివిధ రకాల ఆహార పదార్థాలైనా తింటి ప్రయోజనాల కన్నా వివిధ అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని పలు అ«ధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇంకో విషయమేమిటంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా వాటి ప్రయోజనాలను పొందేందుకు రోజులో ఒక నిర్ధిష్టమైన సమయంలోనే తింటే వాటి ప్రయోజనాలు చేకూరుతాయని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. యాపిల్‌లో ఫైబర్, విటమిన్‌–పొటాషీయం వంటి అనేక పోషకాలు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అంతేకాక అనారోగ్య సమస్యలు తగ్గించడమే కాకుండా శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తాయి.

యాపిల్‌ ఆరోగ్యానికి మంచిదని చెబుతుండటంతో రోజూ ఒక యాపిల్‌ తినేవారు చాలానే ఉన్నారు. ఈ పండులోని ఫ్లేవనైడ్స్, యాంటి ఆక్సిడెన్స్, ఫైటో న్యూట్రీయరన్స్‌ వంటివి ఉంటాయి. యాపిల్‌ ఎక్కువగా తీసుకోవడం కూడా ఆరోగ్యానికి చాలా ప్రమాదకరమని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. షుగర్‌ ఉన్న వాళ్లు సాయంత్రం, లేదా రాత్రుల్లో యాపిల్‌ తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి. ప్రేగుల పనితీరుపై భారం పెరిగి గ్యాస్‌ ప్రాబ్లమ్స్‌ వస్తాయంటున్నారు. వేకువజామున తీవ్రమైన కడుపునొప్పి కూడా వస్తుంది. యాపిల్స్‌తో తయారు చేసిన ఆహార పదార్థాల్లో ఒక ముక్కలో 300–400 క్యాలరీలు ఉంటాయి. 20 గ్రాముల కొవ్వొతో పాటు 20 గ్రాముల చక్కెరస్థాయి కూడా ఉంటుంది. ఇలాంటి ఆహార పదార్థాలను కార్బోహైడ్రేట్స్‌తో తయారు చేస్తారు. ఇవి బరువు పెరగడానికి దోహదపడుతాయి. అంతేకాక టైప్‌–2 డయాబెటీస్, గుండె జబ్బుల ప్రమాదాన్ని సైతం పెంచుతాయి. యూనైటెడ్‌ స్టేట్స్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌ ప్రకారం మీడియం సైజ్‌ యాపిల్‌లో 95 క్యాలరీలతో పాటు ఒక గ్రాము ప్రోటీన్, 25 గ్రాముల కార్బోౖహైడ్రేట్స్‌ 19 గ్రాముల చక్కెర 3 గ్రాముల ఫైబర్‌ ఉంటాయి. యాపిల్‌ తినడం ద్వారా 95 క్యాలరీలు వస్తాయి. 30 నిమిషాల వాకింగ్‌ 16 నిమిషాల రన్నింగ్‌ చేయడంత ఆ క్యాలరీలను బర్న్‌ చేసుకోవచ్చని పలు అధ్యయనాలు తెలుపుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -