పండ్ల కోసం కుక్కల ప్రయత్నం.. వైరల్ వీడియో!

తాజాగా సోషల్ మీడియాలో ఓ వీడియో బాగా వైరల్ అవుతుంది. ఆ వీడియోలో రెండు బెల్జియం శునకాలు చేసిన ఫీట్లు ఓ రేంజ్ లో వైరల్ అవుతున్నాయి. అప్పుడప్పుడు ఏదైనా వస్తువుల కోసం కుక్కలు పిల్లలు వంటి ఇతర జంతువులు అటూ ఇటూ దూకుతూ పట్టుకోవడానికి పరిగెత్తడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఈ రెండు బెల్జియం శునకాలు ఏకంగా చెట్టు మీద ఉన్న పండు ను అందుకోవడానికి వేగంగా పరుగెడుతూ కాండం మీద నుంచి చెట్టుపై వరకు వెళ్లి..

అక్కడి నుంచి అలాగే గాల్లోకి ఎగురుతూ పండును అందుకోవడానికి అవి చేసిన ప్రయత్నాలు సోషల్ మీడియాలో నెటిజన్లలకు విపరీతంగా ఆక్కట్టుకున్నాయి. షెపర్డ్ జాతికి చెందిన ఈ రెండు బెల్జియం శునకాలకు ఓ పెద్ద చెట్టు కు ఉన్న పసుపు రంగులో ఉండే పండు పై కన్ను పడింది. వేగంగా పరిగెడుతూ ఆ పండును అందుకునేందుకు ప్రయత్నిస్తూ కిందికి దూపడం మొదలుపెట్టాయి. ఒకదాని వెనుక మరో ఒకటి ప్రయత్నిస్తూ, కిందికి దూకుతూ ఉన్నాయి.

రెండింటిలో ఉష్ణకం ఆ పండును అందుకొని కిందికి దూకగలిగింది. వెంటనే ఇంకో క్షణం దాని దగ్గరికి వచ్చి ఆ పండును లాక్కోవడానికి ప్రయత్నించింది. ఇక రెండు కలిసి ఆ పండును లాక్కుంటూ పొలాల్లోకి పరిగెత్తాయి. మోరిస్సా శ్వార్జ్ అనే ట్విట్టర్ అకౌంట్లో దీనికి సంబంధించి ఒక వీడియో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోను చూసిన వారందరూ ఈ శునకాలను కామెంట్ల ద్వారా మెచ్చుకుంటున్నారు.

”ఇవి మంచి క్రీడాకారులు” అంటూ క్యాప్షన్ లో పెడుతున్నారు. ఈ వీడియో టైం డ్యూరేషన్ 11 సెకండ్లు ఉన్న సోషల్ మీడియాలో మాత్రం విపరీతంగా వైరల్ గా మారింది. ఇప్పటికీ ఈ వీడియోకు 30 లక్షల కి పైగా వ్యూస్ వచ్చాయి. వేలల్లో దీనికి లైక్స్ షేర్లు వస్తున్నాయి. “శునకాలు కాదు ప్రొఫెషనల్ అథ్లెట్లలా ఉన్నాయి”. “ఇవి కుక్కల్లా లేవు చిరుతపులను చెట్టు ఎక్కి దూకుతున్నట్టుగా ఉంది” అని కొందరు ఈ శునకాలను మెచ్చుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -