Bellamkonda Srinivas: ఆర్థిక ఇబ్బందుల వల్ల అలా చేసిన బెల్లంకొండ శ్రీనివాస్.. ఏమైందంటే?

Bellamkonda Srinivas: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. బెల్లంకొండ శ్రీనివాస్ పేరు వినగానే ముందుగా గుర్తుకు వచ్చేసి సినిమా అల్లుడు శీను. శ్రీనివాస్ మొదటి సినిమా అయినా ఈ సినిమా మంచి సక్సెస్ ను సాధించడంతో పాటు హీరోగా మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ సినిమాలోని పాటలు కూడా అన్ని హైలైట్ గా నిలిచాయి. ఈ సినిమాతో హిట్ ని అందుకున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులకు కారణంగా దాదాపు ఇంట్లోనే ఉన్నాడట బెల్లంకొండ శ్రీనివాస్. బెల్లంకొండ శ్రీనివాస్ తాజాగా నటించిన హిందీ చిత్రం చత్రపతి. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు..

ఈ సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ.. నా తండ్రి నిర్మాత కావడం వల్లే నేను సినిమాల్లోకి సులభంగా రాగలిగానని అందరూ అంటుంటారు. అది నిజమే. నా తొలి సినిమా అల్లుడు శీనుకు ఆయన నాకెంతో సపోర్ట్‌గా నిలిచారు. అయితే, ఆయన సపోర్ట్‌తో పాటు నా హార్డ్‌వర్క్‌ కూడా ఉండటం వల్లే ఈ స్థాయిలో ఉన్నాను. ఆ సినిమాలో నటించడానికి సమంత, తమన్నా వంటి స్టార్‌ హీరోయిన్స్‌ ఎందుకు అంగీకరించారనేది ఎవరికీ తెలియదు. అల్లుడు శీను ప్రాజెక్ట్‌ ఓకే అనుకున్నాక సమంత, తమన్నాకు నా డ్యాన్స్‌, డైలాగ్‌ డెలివరీ తెలియజేసేలా ఒక డెమో వీడియో క్రియేట్‌ చేసి పంపించాను.

 

నా హార్డ్‌వర్క్‌ను చూసిన తర్వాత వాళ్లు సినిమా ఓకే చేశారు. ఆ సినిమా విజయం సాధించి బాక్సాఫీస్‌ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. అదే సమయంలో మా నాన్న ఒక సినిమా నిర్మించారు. అది బాక్సాఫీస్‌ వద్ద నిరాశనే మిగిల్చింది. అలాగే, డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించిన ఎనిమిది సినిమాలు వరుసగా ఫెయిల్‌ అయ్యాయి. దాంతో మా కుటుంబం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంది. వాటి నుంచి ఎలా బయటపడాలో అర్థం కాలేదు. దాంతో నాపై ఒత్తిడి పెరిగింది. అప్పుడు ఎన్నో అవకాశాలు వచ్చినా సినిమాలు చేయలేదు. అలా, ఏడాదిన్నర పాటు ఇంట్లోనే కూర్చున్నాను. తర్వాత తక్కువ బడ్జెట్‌లో రెండో సినిమా చేశాను బోయపాటి శ్రీను తెరకెక్కించిన జయ జానకీ నాయక వల్ల అన్ని విధాలుగా నిలదొక్కుకోగలిగాను. ఆ సమయంలో నన్ను నమ్మి ఆయన నాతో సినిమా చేసినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చారు బెల్లంకొండ శ్రీనివాస్.

 

Related Articles

ట్రేండింగ్

Sai Dharam Tej-Swathi: సాయితేజ్, స్వాతిరెడ్డి మధ్య అలాంటి బంధం ఉందా.. విడాకుల వెనుక ట్విస్టులు ఉన్నాయా?

Sai Dharam Tej-Swathi:స్వాతి రెడ్డి, సాయి ధరమ్ తేజ్ ని స్టేజిపై ఒరేయ్ అని పిలవడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయిన సంఘటన మంత్ ఆఫ్ మధు ట్రైలర్ ఈవెంట్లో జరిగింది....
- Advertisement -
- Advertisement -