Salt Water Gargle: ప్రస్తుతం వర్షాకాలం ముగిసి ఇక చలికాలం ప్రవేశించింది. సీజన్ మారిన ప్రతి సారీ చాలా మంది ఇబ్బంది పడుతుంటారు. జలుబు, ముక్కుదిబ్బడ, దగ్గు, ఫీవర్ లాంటి సమస్యలు అనేక మందిని వేధిస్తాయి. ముఖ్యంగా గొంతు సమస్యలు అధికంగా వస్తుంటాయి. ఈ సమస్యల నివారణకు ఆస్పత్రులకు వెళ్లే పని లేకుండా ఇంట్లోనే అనేక రెమెడీస్ ఉంటాయి. వీటిని ఫాలో అయితే ఆయా సమస్యల నుంచి వెంటనే బయటపడి సాధారణ జీవితం గడిపేయొచ్చు.
ఇంట్లో ఉండే పదార్థాలతోనే చాలా వరకు ఆరోగ్య చిట్కాలు పాటించవచ్చు. ముఖ్యంగా వంటింట్లో ఉండే ఉప్పును వాడితే చాలా రకాల సమస్యలు దూరం అవుతాయి. ఉప్పు నీటిని గొంతులో పోసుకొని పుక్కిలించడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. గొంతు సమస్యలున్నా, శ్వాసకోశ సమస్యలున్నా తక్షణం రిలీఫ్ లభిస్తుంది.
బ్రష్ చేశాక ఉప్పునీటితో ఇలా చేయండి..
మనం రోజూ ఉదయాన్నే బ్రష్ చేశాక ఉప్పు నీటితో పుక్కిలించాలి. ఇలా చేయడం వల్ల శ్వాసకోశ సమస్యలతో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. గొంతులో బ్యాక్టీరియా, వైరస్ లు, సూక్ష్మజీవుల బారి నుంచి కాపాడుకోవచ్చు. బాడీలో యాసిడ్స్ లెవల్స్ ను స్థిరీకరిస్తుంది. నోట్లో దుర్వాసన సమస్య కూడా పోతుంది. ముక్కుదిబ్బడ సమస్యకు మంచి పరిష్కారం ఉప్పునీటిని పుకిలించడం. తరచూ నాలుక, నోట్లో పగుళ్లు, వాపులు లాంటి సమస్యలున్న వారు కూడా ఇలా ట్రై చేసి చూస్తే మంచి ఫలితాలొస్తాయి.
చిగుళ్ల వాపు, రక్తం కారడం, పంటినొప్పి లాంటి సమస్యలున్న వారు ఉప్పు నీటిని పుక్కిలించడం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు. రోజుకోసారి ఇలా చేయడం వల్ల నోరు పరిశుభ్రంగా తయారవుతుంది. గొంతులో ఉన్న టాన్సిల్స్ వాపు సమస్య కూడా తగ్గుతుంది. చక్కటి ఆహారం, ద్రవాలను తీసుకొనేందుకు మార్గం సుగమం అవుతుంది.